ఈషా అంబానీ ‘బంగారం’ బ్లౌజ్ చూశారా?

అపర కుబేరుడు అంబానీ వాళ్లింట్లో పెళ్లంటే ఎంత వైభవంగా జరుగుతుందో ఇటీవలే ముగిసిన అనంత్‌-రాధికల ముందస్తు పెళ్లి వేడుకలతోనే మరోసారి అందరికీ అర్థమైంది. రాజ వైభోగాలకు ఏమాత్రం తీసిపోకుండా జరిగిన వీరి ప్రి-వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌ ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాయి.

Updated : 09 Mar 2024 14:16 IST

(Photos: Instagram)

అపర కుబేరుడు అంబానీ వాళ్లింట్లో పెళ్లంటే ఎంత వైభవంగా జరుగుతుందో ఇటీవలే ముగిసిన అనంత్‌-రాధికల ముందస్తు పెళ్లి వేడుకలతోనే మరోసారి అందరికీ అర్థమైంది. రాజ వైభోగాలకు ఏమాత్రం తీసిపోకుండా జరిగిన వీరి ప్రి-వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌ ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాయి. ఇక ఈ వేడుకల్లో అంబానీ కుటుంబ సభ్యులు, అతిథులు ధరించిన దుస్తులు టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలిచాయి. అందులోనూ ఓ వేడుకలో ఈషా అంబానీ ధరించిన బంగారు బ్లౌజ్‌ గురించే ఇప్పుడు నెట్టింట్లో చర్చ జరుగుతోంది. బంగారు-వెండి జరీ, వజ్ర వైఢూర్యాలు వంటి విలువైన ఆభరణాలతో హంగులద్దిన ఈ రవికెను చేత్తో తీర్చిదిద్దడం మరో విశేషం. మరి, ఈషా ధరించిన ఈ గోల్డెన్‌ బ్లౌజ్‌ విశేషాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

సందర్భానికి తగినట్లుగా సంప్రదాయ, మోడ్రన్‌ దుస్తుల్ని ఎంచుకోవడంలో ఈషా అంబానీ స్టైలే వేరు. ఫ్యాషన్‌ షోలు, తమ కుటుంబంలో జరిగే పెళ్లిళ్లు, వేడుకల కోసం ఆమె ఎంచుకునే అవుట్‌ఫిట్సే ఇందుకు నిదర్శనం. ఇక ఇప్పుడు తన తమ్ముడు అనంత్‌ అంబానీ ప్రి-వెడ్డింగ్‌ వేడుకల్లోనూ.. ఆయా ఈవెంట్స్‌ థీమ్స్‌కి తగినట్లుగా అద్భుతమైన ఫ్యాషన్లతో మెరుపులు మెరిపించిందీ అంబానీ ప్రిన్సెస్.

‘గోల్డెన్‌’ బ్లౌజ్‌ తళుకులు!

అనంత్‌-రాధికల ప్రి వెడ్డింగ్‌ వేడుకల్లో భాగంగా.. ఓ వేడుక కోసం ప్రముఖ డిజైనర్‌ ద్వయం అబుజానీ-సందీప్‌ ఖోస్లా రూపొందించిన గోల్డెన్‌ జరీతో ఎంబ్రాయిడరీ చేసిన ఎరుపు రంగు భారీ లెహెంగాను ఎంచుకుందామె. దీనికి జతగా ఎరుపు రంగు బ్లౌజ్‌ను ఎంచుకున్న ఈషా.. దానిపై అత్యంత విలువైన బంగారు జరీ, వజ్ర వైఢూర్యాలతో డిజైన్‌ చేయించుకుంది. ఇక ఈ బ్లౌజ్ తయారీలో వాడిన నవరత్నాల్లో చాలావరకు ఈషా వద్ద ఉన్నవే వాడారట. మరికొన్ని గుజరాత్‌, రాజస్థాన్‌ వంటి రాష్ట్రాల నుంచి తెప్పించారట!

‘ఈషా తన వద్ద ఉన్న విలువైన వజ్రాభరణాలతో ఈ బ్లౌజ్‌ను కస్టమైజ్‌ చేయించుకుంది. ఇందులో పోల్కీ, రూబీ, వజ్రాలు, పచ్చలు, కెంపులు.. వంటివెన్నో వాడాం. ఎరుపు రంగు బ్లౌజ్‌పై ఈ ఆభరణాలన్నీ హ్యాండ్‌ ఎంబ్రాయిడరీ చేయడంతో వాటి అందం ద్విగుణీకృతమైంది. ముందుగా బ్లౌజ్ డిజైన్‌కు సంబంధించిన ఆర్ట్‌ వర్క్‌ని పేపర్‌పై గీసుకొని తుది రూపు తీసుకొచ్చాకే బ్లౌజ్‌పై డిజైన్‌ చేశాం.. గోల్డ్‌, సిల్వర్‌ జర్దోసీ వర్క్‌లో ఈ విలువైన ఆభరణాల్ని పొదుగుతూ రూపొందించిన ఈ బ్లౌజ్‌.. ఈషాకు సరికొత్త లుక్‌ని తీసుకొచ్చింది..’ అంటూ బ్లౌజ్‌ డిజైనింగ్‌ గురించి సోషల్‌ మీడియాలో సుదీర్ఘ పోస్ట్‌ పెట్టారీ డిజైనర్లు. ఈషా ఫ్యాషన్‌ సెన్స్‌ని మరోసారి చాటిచెప్పిన ఈ బ్లౌజ్‌ ఫొటోలు, బ్లౌజ్‌ డిజైనింగ్‌ వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. బ్లౌజ్‌ అందాన్ని, ఈ అంబానీ ప్రిన్సెస్‌ స్టైల్‌ను ప్రశంసిస్తూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్