సహజానికే కోట్లమంది ఓటు!

కొవిడ్‌ తర్వాత ఆరోగ్య స్పృహ పెరిగిందన్న విషయం తెలిసిందే! అమ్మాయిల్లో ముఖ్యంగా సహజ అందంపై ఆసక్తి పెరిగిందట. ఈ ఏడాది ఎక్కువమంది ఆరోగ్యకరమైన చర్మంపైనే దృష్టిపెట్టారని చెబుతున్నాయి అధ్యయనాలు.

Published : 30 Dec 2022 00:36 IST

కొవిడ్‌ తర్వాత ఆరోగ్య స్పృహ పెరిగిందన్న విషయం తెలిసిందే! అమ్మాయిల్లో ముఖ్యంగా సహజ అందంపై ఆసక్తి పెరిగిందట. ఈ ఏడాది ఎక్కువమంది ఆరోగ్యకరమైన చర్మంపైనే దృష్టిపెట్టారని చెబుతున్నాయి అధ్యయనాలు. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో ‘హ్యాష్‌ట్యాగ్‌ స్కిన్‌కేర్‌’ను ప్రపంచవ్యాప్తంగా 13,800 కోట్లసార్లు వినియోగించారట. స్కిన్‌కేర్‌ రొటీన్‌, మచ్చల్లేని ముఖం, ఎండ నుంచి రక్షణకు ఏ క్రీములు వాడాలన్నవి ఎక్కువగా వెదికారట. వాటిల్లోనూ సహజ పదార్థాలతో చేసిన వాటికే ప్రాధాన్యమిచ్చారు. ‘ముడతలు, మచ్చల్లేకుండా చర్మం సాగకుండా ఎలా జాగ్రత్తపడాలి’ అన్నది వయసుతో సంబంధం లేకుండా ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్న అంశమైంది. ఇక ‘సాల్సిలిక్‌ యాసిడ్‌’ గురించి నెలకు కనీసం 70 వేలమంది వెదికారు. దీన్ని గురించిన ప్రస్తావనలు 370కోట్లకు పైమాటే. ఆ తర్వాతి స్థానం రెటినాల్‌ది. సోషల్‌మీడియాలో దీనికి 240 కోట్లకుపైగా హ్యాష్‌టాగ్‌లున్నాయి. తర్వాతి స్థానాల్లో విటమిన్‌ సి (200 కోట్లు), హైలురోనిక్‌ యాసిడ్‌ (76 కోట్లు) నిలిచాయి. మొత్తంగా ‘బ్యూటీ ట్రెండ్స్‌ రిపోర్ట్‌’ ప్రకారం ఎక్కువమంది దృష్టి సహజంగా ఆరోగ్యంగా కనిపించాలి, తక్కువ మేకప్‌ ఉపయో గించాలన్న దానిపైనే! మంచి ధోరణే కదా!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్