Twitter: పరాగ్‌కు హు జింటావోకు పోలిక.. మస్క్‌ తొలగింపులపై నెటిజన్ల స్పందన..!

ట్విటర్‌లో సీనియర్ అధికారుల తొలగింపుపై నెటిజన్లు స్పందిస్తున్నారు. మీమ్స్‌ రూపంలో తమ టాలెంట్‌ అంతా చూపిస్తున్నారు. 

Published : 28 Oct 2022 16:02 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పలు నాటకీయ పరిణామాల అనంతరం ప్రపంచ కుబేరుడు ఎలాన్‌మస్క్‌ సామాజిక మాధ్యమ సంస్థ ట్విటర్‌ను సొంతం చేసుకున్నారు. ఎంట్రీ రోజే ఉన్నతోద్యోగులపై వేటు వేశారు. సీఈఓగా ఉన్న పరాగ్‌ అగర్వాల్‌ను బయటకి పంపించారు. దీనిపై నెటిజన్లు మీమ్స్‌ వర్షం కురిపిస్తున్నారు. 

ఇటీవల చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ మహాసభలు జరిగాయి. సభల ముగింపు రోజున అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ సమక్షంలోనే మాజీ అధ్యక్షుడు హు జింటావోను కొందరు సిబ్బంది బయటకు తీసుకెళ్లారు. ఇప్పుడు ఆ వీడియోను పరాగ్‌-మస్క్‌ వ్యవహారానికి ఆపాదిస్తున్నారు. జిన్‌పింగ్ స్థానంలో మస్క్‌, జింటావో స్థానంలో పరాగ్‌ను ఉంచి మీమ్‌ సిద్ధం చేశారు. ‘మీరు దిగ్గజ సంస్థకు సీఈఓ అయితే ఏంటి.. ప్రభుత్వ ఉద్యోగాల్లోనే భద్రత’ అంటూ మరొకరు కామెంట్‌ పెట్టారు.   







Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని