Ukraine: డాన్‌బాస్‌లో ఉక్రెయిన్‌ పతాకం రెపరెపలు.. తర్వాతి లక్ష్యం లైమన్‌!

ష్యాపై దండయాత్రకు పాల్పడిన పుతిన్‌ రష్యా అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ఆక్రమించుకున్న భూభాగాలను తిరిగి సొంతం చేసుకుంటామని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ అన్నారు. ఈ యుద్ధం రష్యా చారిత్రక తప్పిదంగా మిగిలిపోతుందని ఆయన పేర్కొన్నారు.

Published : 05 Oct 2022 01:58 IST

కీవ్‌: రష్యన్‌ బలగాల అదుపులో ఉన్న డాన్‌బాస్‌ నగరాన్ని తిరిగి చేజిక్కించుకున్న ఉక్రెయిన్‌.. తాము కోల్పోయిన మరిన్ని భూభాగాలపై పట్టుసాధించాలని ప్రయత్నిస్తోంది. ఉక్రెయిన్‌ ప్రాంతాలను తిరిగి సాధిస్తామని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ గత శనివారం ప్రతిజ్ఞ చేసిన సంగతి తెలిసిందే. దానికి తగినట్లే గత వారం రోజులుగా డాన్‌బాస్‌ నగరంలో ఉక్రెయిన్‌ జెండాల రెపరెపలాడుతున్నాయి. తాజాగా ఉక్రెయిన్‌ బలగాలు కీలక లైమన్ నగరానికి చేరుకున్నట్లు ఉక్రెయిన్‌ రక్షణశాఖ ఓ వీడియోను పోస్టు చేసింది. ఆ తర్వాత జెలెన్ స్కీ మాట్లాడారు. రష్యాపై దండయాత్రకు పాల్పడిన పుతిన్‌ రష్యా అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ఆక్రమించుకున్న భూభాగాలను తిరిగి సొంతం చేసుకుంటామన్నారు. తెలివితక్కువ తనంతో ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించిన పుతిన్‌.. అధ్యక్ష స్థాననంలో ఉన్నంత వరకు రష్యా ఒక్కొక్కరిగా కోల్పోతూ ఉంటుందని చెప్పారు.  ఈ యుద్ధం రష్యా చారిత్రక తప్పిదంగా మిగిలిపోతుందని జెలెన్‌స్కీ పేర్కొన్నారు.

చర్చలు జరిపే ప్రసక్తే లేదు: జెలెన్‌ స్కీ

రష్యా అధ్యక్షుడిగా పుతిన్‌ ఉన్నంత వరకు ఆ దేశంతో చర్చలు జరిపేది లేదని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ పునరుద్ఘాటించారు. ఈ మేరకు అధికారిక పత్రంపై ఆయన మంగళవారం సంతకాలు చేశారు. గత శుక్రవారం ఉక్రెయిన్‌లోని ఖేర్సన్‌, జపోరిజియా,లుహాన్స్క్‌, దొనెట్స్క్‌ ప్రాంతాలను రష్యాలో విలీనం చేస్తున్నట్లు పుతిన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఒప్పందాలపై సంతకాలు చేస్తూ.. చర్చలకు రావాలని ఉక్రెయిన్‌కు సూచించారు. దీనిపై అప్పుడే స్పందించిన జెలెస్కీ.. పుతిన్‌ అధ్యక్షుడిగా ఉన్నంత వరకు చర్చలకు వెళ్లేది లేదని తేల్చి చెప్పారు. ఇదే విషయమై తాజాగా అధికారిక పత్రంపై సంతకాలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని