Ukraine: షాపింగ్‌మాల్‌పై రష్యా క్షిపణి దాడి.. పది మందికిపైగా మృతి

ఉక్రెయిన్‌లోని రద్దీగా ఉన్న షాపింగ్‌ మాల్‌పై రష్యా క్షిపణి దాడి చేసింది.  ఈ దాడి ఘటనలో సుమారు 10 మంది మరణించగా 40 మందికిపైగా గాయపడ్డారు. తూర్పు ఉక్రెయిన్‌ నగరమైన క్రెమెన్‌చుక్‌లో సోమవారం ఈ సంఘటన జరిగినట్లు అక్కడి అధికార ప్రతినిధి డిమిట్రో లునిన్‌ ధ్రువీకరించారు.

Published : 27 Jun 2022 23:27 IST

కీవ్‌: ఉక్రెయిన్‌లోని రద్దీగా ఉన్న షాపింగ్‌ మాల్‌పై రష్యా క్షిపణి దాడి చేసింది.  ఈ దాడి ఘటనలో సుమారు 10 మంది మరణించగా 40 మందికిపైగా గాయపడ్డారు. తూర్పు ఉక్రెయిన్‌ నగరమైన క్రెమెన్‌చుక్‌లో సోమవారం ఈ సంఘటన జరిగినట్లు అక్కడి అధికార ప్రతినిధి డిమిట్రో లునిన్‌ ధ్రువీకరించారు. ఆ ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు.  

అయితే, తాజా ఘటనపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్పందించారు. ఈమేరకు ఆయన మెసేజింగ్‌ యాప్‌ టెలిగ్రామ్‌లో ఇలా రాసుకొచ్చారు. ‘‘రద్దీ షాపింగ్‌ మాల్‌పై రష్యా క్షిపణి దాడి చేసింది. ఆ సమయంలో సుమారు వెయ్యి మందికి పైగా మాల్‌లో ఉన్నారు. క్షిపణి దాడి వల్ల షాపింగ్‌ మాల్‌లో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ఈ సంఘటనలో ఎంత మంది గాయపడ్డారో లెక్కించడం కష్టంగా ఉంది’’ అని జెలెన్‌స్కీ వెల్లడించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని