China: రేపు అంతరిక్షంలోకి పౌర వ్యోమగామి.. ఏర్పాట్లు సర్వం సిద్ధం..!
అంతరిక్షంలోకి తొలిసారి పౌరుడిని పంపేందుకు చైనా సర్వం సన్నద్ధం చేసింది. చంద్రుడిపైకి మనుషులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా ఈ యాత్ర జరుగుతోంది.
ఇంటర్నెట్‌డెస్క్: అంతరిక్షంలోకి పౌర వ్యోమగామిని పంపేందుకు చైనా పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసింది. టియాంగాంగ్ స్పేస్‌స్టేషన్ మిషన్‌లో భాగంగా ఈ యాత్ర జరగనున్నట్లు చైనా మ్యాన్డ్ స్పేస్ ఏజెన్సీ పేర్కొంది. బీజింగ్ విశ్వవిద్యాలయంలో ఏరోనాటిక్స్ అండ్ ఆస్ట్రోనాటిక్స్ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేసే పేలోడ్ నిపుణుడు గుయ్ హైచావ్‌ను పంపేందుకు ఏర్పాట్లు చేసింది. ఇప్పటి వరకు చైనా అంతరిక్షంలోకి పంపిన వారు మొత్తం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన వ్యోమగాములే. గుయ్.. నాన్ ఆర్బిట్ స్పేస్ ఆపరేషన్స్‌కు బాధ్యత వహిస్తాడు. ఈ మిషన్ వాయువ్య చైనాలోని జ్యూకాన్ శాటిలైట్ లాంఛ్ సెంటర్ నుంచి మంగళవారం ఉదయం 9.31 గంటలకు ప్రారంభం కానుందని స్సేస్ ఏజెన్సీ వెల్లడించింది.
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు ప్రణాళిక అయిన ‘స్పేస్‌డ్రీమ్’ను మరింత ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా ఈ యాత్ర జరుగుతోంది. ఇప్పటికే సైనిక అంతరిక్ష కార్యక్రమంలో డ్రాగన్ బిలియన్ల కొద్దీ డాలర్లను పెట్టుబడి పెట్టింది. భవిష్యత్తులో చంద్రుడిపైకి మనుషులను తరలించడమే దీని లక్ష్యం. ఇందుకోసం మానవ రహిత చంద్రయాత్ర-2029ని నిర్దేశించుకొంది. దీనికి తోడు చైనా నిర్మిస్తున్న అంతరిక్ష కేంద్రానికి సంబంధించిన తుది మాడ్యూల్ ‘హెవెన్‌లీ ప్యాలెస్’ను గతేడాది విజయవంతంగా కోర్ వద్దకు చేర్చారు. ఈ స్పేస్ స్టేషన్ లోఎర్త్ ఆర్బిట్‌లో 400 నుంచి 450 కిలోమీటర్ల మధ్య 10 ఏళ్లపాటు పనిచేయనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Modi: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పు
-
Asian Games 2023 : అట్టహాసంగా ఆసియా క్రీడలు ప్రారంభం.. ప్రధాని మోదీ స్పెషల్ ట్వీట్!
-
social look: అనుపమ ఉవాచ.. రష్మిక ఫస్ట్‌లుక్.. ఇంకా ఎన్నో ముచ్చట్లు..
-
IND vs AUS: ఆసీస్‌తో రెండో వన్డే.. శ్రేయస్ అయ్యర్‌కు ఇదేనా చివరి ఛాన్స్..?
-
iPhone: ఐఫోన్ డెలివరీ ఆలస్యం.. కోపంతో షాపు ఉద్యోగులనే చితకబాదారు
-
Defamation: కాంగ్రెస్ ఎంపీపై.. అస్సాం సీఎం సతీమణి రూ.10 కోట్లకు దావా!