Space: ఇకపై అంతరిక్షంలో వ్యోమగాములు ఫ్రెంచ్ ఫ్రైస్ తినొచ్చు!
అంతరిక్షం (Space)లోకి వెళ్లే వ్యోమగాములు (Astronauts) తినేదంతా ప్రాసెస్ చేసిన ఆహారం మాత్రమే. అందులోనూ.. వారికి నచ్చిన ఆహారం వండుకొని తినే అవకాశం ఉండదు. ఇకపై ఈ సమస్యకు చెక్ పెడుతూ ఈఎస్‌ఏ (ESA) శాస్త్రవేత్తలు వ్యోమగాముల కోసం కొత్తగా ఆహారాన్ని వండుకునే పద్ధతిని కనిపెట్టారు.
ఇంటర్నెట్ డెస్క్: అదేంటీ.. అంతరిక్షం (Space)లో ఫ్రెంచ్ ఫ్రైస్ (French Fries) ఎలా తింటారు?అక్కడ వండుకోవడం సాధ్యం కాదు కదా! అనేగా మీ సందేహం. ఈ సమస్యకు శాస్త్రవేత్తలు ఓ పరిష్కారం కనుగొన్నారు. ఇకపై భూమ్మీద ఉండేవారు వేడి వేడిగా.. కరకరలాడే ఫ్రెంచ్ ఫ్రైస్‌ను తిన్నట్లే.. అంతరిక్షంలోనూ వ్యోమగాములు (Astronauts) వాటిని వేయించుకొని తినొచ్చు. దీనికోసం యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA)కి చెందిన శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగాలు విజయవంతం అయ్యాయి. ఇకపై అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములు సరికొత్త పద్ధతుల్లో ఆహార పదార్ధాలను వండుకోనున్నారు.
‘‘కొన్నిసార్లు మీకు అవసరమైన ఆహారం వండుకోవడానికి చెఫ్‌ల అవసరం లేకపోయినా.. శాస్త్రవేత్తల అవసరం తప్పకుండా ఉంటుంది. అందులోనూ గాలిలేని ప్రదేశంలో మీరు ఉంటే కచ్చితంగా శాస్త్రవేత్తలు అవసరం. ప్రపంచంలో ఎక్కడైనా బంగాళదుంప ముక్కలను వేయిస్తున్నారు. అలాంటిది అంతరిక్షంలో ఎందుకు వేయించకూడదు? ఇందుకోసం మేం ఓ ప్రయోగం చేపట్టాం. రెండు విమానాల్లో గురుత్వాకర్షణ లేని చోటుకి వెళ్లాం. ఒక ప్రత్యేకమైన గుండ్రంగా తిరిగే ఉపకరణంలో ఆయిల్‌ను బయటకు రాకుండా వేడిచేసి, అందులో బంగాళదుంప ముక్కలు వేశాం. ఆయిల్ బుడగల రూపంలో వాటి చుట్టూ చేరింది. బంగాళదుంప ముక్కలు ఉడికిన తర్వాత ఆయిల్ బుడగలు వాటి నుంచి వేరయ్యాయి’’అని పరిశోధనా బృందం తెలిపింది. ఈ సరికొత్త ఆవిష్కరణతో వ్యోమగాములు అంతరిక్షంలో కూడా ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి వాటిని నూనెలో వేయించుకుని తినవచ్చని తెలిపారు. తర్వలోనే దీన్ని పూర్తిస్థాయిలో అభివృద్ది చేసి వ్యోమగాములకు అందుబాటులోకి తెస్తామని ఈఎస్‌ఏ ప్రకటించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Jawan: ‘జవాన్’తో అరుదైన రికార్డు సృష్టించిన షారుక్.. ఒకే ఏడాదిలో రెండుసార్లు..
-
Whatsapp: ఈ ఫోన్లలో త్వరలో వాట్సప్ బంద్.. లిస్ట్ ఇదిగో..
-
Ukraine: ఒడెస్సా పోర్టులో రష్యా భారీ విధ్వంసం..!
-
RDX Movie Review: రివ్యూ: ఆర్డీఎక్స్.. మలయాళంలో రూ.80 కోట్లు వసూలు చేసిన మూవీ ఓటీటీలో వచ్చేసింది!
-
Chandrababu Arrest: చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణ వాయిదా
-
Andhra news: గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుబట్టిన కాగ్