Hunter Biden: బైడెన్‌ కుమారుడి పన్ను నేరాలపై ఆధారాలు..!

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్‌ పన్ను నేరాలకు సంబంధించి తమ వద్ద ఆధారాలున్నాయని ఫెడరల్ ఏజెంట్లు పేర్కొన్నారు.

Published : 08 Oct 2022 01:08 IST

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్‌ పన్ను నేరాలకు సంబంధించి తమ వద్ద ఆధారాలున్నాయని ఫెడరల్ ఏజెంట్లు పేర్కొన్నారు. హంటర్‌, ఆయన మొదటి భార్యను విచారించడానికి ఈ ఆధారాలు సరిపోతాయని వారు భావిస్తున్నారు. అయితే ఆయనపై కేసు పెట్టాలా..? వద్దా..? అనేది ప్రాసిక్యూటర్ నిర్ణయిస్తారని వాషింగ్టన్ పోస్టు కథనం పేర్కొంది. అలాగే గన్ కొనుగోలు విషయంలో కూడా తప్పుడు వివరాలు ఇచ్చినట్లు ఆధారాలున్నాయని తెలిపింది. ట్రంప్ హయాంలో నియమితులైన యూఎస్ అటార్నీ డేవిడ్ వీస్ హంటర్‌పై కేసు గురించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. 

ఉక్రెయిన్‌తో పాటుగా చైనాలో హంటర్ బైడెన్ వ్యాపారలావాదేవీలపై గతంలో ఆరోపణలు వచ్చాయి. వాటిని మొదట న్యూయార్క్‌ పోస్టు రిపోర్ట్‌ చేసింది. దానిని సోషల్‌ మీడియా సంస్థలు సెన్సార్‌ చేశాయి. ఇదిలా ఉంటే.. ఫెడరల్ ఏజెంట్లు చట్టవిరుద్ధంగా సమాచారాన్ని లీక్‌ చేస్తున్నాయని హంటర్ న్యాయవాది విమర్శించారు.  ఈ లీక్‌పై విచారణ జరిపించాలని జస్టిస్‌ డిపార్ట్‌మెంట్‌ను కోరారు.

2018లో హంటర్ గన్ కొనుగోలు చేసేప్పుడు ఇచ్చిన వివరాల్లో తాను చట్టవిరుద్ధంగా డ్రగ్స్ వాడడం లేదని, వాటికి బానిస కాలేదని చెప్పారు. కానీ 2021లో ప్రచురితమైన మెమోయిర్‌లో మాత్రం తానింకా క్రాక్‌ కొకైన్‌కు బానిసగా ఉన్నట్లు చెప్పారు. కొకైన్ పాజిటివ్‌గా రావడంతో ఆయన 2014లో యూఎస్ నావీని వీడాల్సి వచ్చింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని