ఎలిజబెత్‌-2కు శాశ్వత స్మారకం

గతేడాది సెప్టెంబరు 8న మరణించిన బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-2కు శాశ్వత స్మారకాన్ని నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

Published : 04 Sep 2023 05:24 IST

నిర్మాణానికి బ్రిటన్‌ ప్రభుత్వ సన్నాహాలు
2026లో ప్రణాళిక ఆవిష్కరణ

లండన్‌: గతేడాది సెప్టెంబరు 8న మరణించిన బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-2కు శాశ్వత స్మారకాన్ని నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆమె తొలి వర్ధంతి సమీపిస్తున్న నేపథ్యంలో.. బ్రిటన్‌ ప్రభుత్వం ఆదివారం దీనిపై ప్రకటన చేసింది. స్మారకానికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసేందుకు ఓ స్వతంత్ర కమిటీని నియమించింది. ఎలిజబెత్‌-2 మాజీ వ్యక్తిగత కార్యదర్శి లార్డ్‌ రాబిన్‌ జన్‌వ్రిన్‌ దీనికి అధ్యక్షత వహించనున్నారు. ఈ కమిటీలో మరికొందరు నిపుణులు, ప్రముఖులను నియమించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. వారు స్మారక నిర్మాణంపై ప్రతిపాదనలను ప్రభుత్వంతో పాటు ప్రస్తుత రాజు ఛార్లెస్‌-3కి అందిస్తాయని తెలిపాయి. ఎలిజబెత్‌-2 శత జయంతి సంవత్సరమైన 2026లో స్మారకానికి సంబంధించిన ప్రణాళికను ఆవిష్కరించనున్నట్లు వెల్లడించాయి. 70ఏళ్ల పాటు రాణి హోదాలో ఎలిజబెత్‌-2 చేసిన ప్రజా సేవను ప్రతిబింబించేలా స్మారకం ఉండబోతోంది. దీని నిర్మాణానికి బ్రిటన్‌ ప్రభుత్వం నిధులు అందించనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని