Donald Trump: ‘24 గంటల్లోపే ఉక్రెయిన్‌ యుద్ధానికి తెరదించుతా..!’

ఉక్రెయిన్‌- రష్యాల వివాదాన్ని 24 గంటల్లోపే ముగించగలనని డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. 2020లోనే తాను మళ్లీ అమెరికా అధ్యక్షుడిగా గెలిచి ఉంటే.. ఈ యుద్ధం మొదలయ్యేదే కాదని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

Published : 28 Mar 2023 21:38 IST

వాషింగ్టన్‌: ఉక్రెయిన్‌ (Ukraine)పై రష్యా (Russia) సైనిక చర్య ఏడాదికిపైగా కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఈ వివాదం పరిష్కారం దిశగా ఇప్పటికీ ఎటువంటి అడుగులు పడటం లేదు.  అయితే, ఈ రెండు దేశాల మధ్య సంక్షోభాన్ని (Ukraine Crisis) తాను 24 గంటల వ్యవధిలోనే ముగించగలనని అమెరికా (America) మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) తాజాగా వ్యాఖ్యానించారు. రష్యా, ఉక్రెయిన్‌ అధ్యక్షులు పుతిన్‌, జెలెన్‌స్కీలతో శాంతి చర్చల ద్వారా దీన్ని సాధ్యం చేస్తానన్నారు. ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ మేరకు మాట్లాడారు.

‘2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిసేలోగా యుద్ధం కొలిక్కి రాకపోతే.. నేను అమెరికా అధ్యక్షుడిగా మళ్లీ ఎన్నికైతే.. ఒక్క రోజులో శాంతి పరిష్కారాన్ని చూపుతా. సులభమైన చర్చలతో.. రెండు దేశాల మధ్య వివాదానికి తెరపడుతుంది’ అని ట్రంప్‌ తెలిపారు. 2020లోనే తాను మళ్లీ అధ్యక్షుడిగా గెలిచి ఉంటే.. ఈ సంక్షోభం ఏర్పడేదే కాదని పునరుద్ఘాటించారు. రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య మరో ఏడాదిన్నర వరకు చర్చలు మొదలు కావని.. అప్పటికి యుద్ధం మరింత ముదిరే అవకాశం ఉందని ట్రంప్‌ పేర్కొన్నారు. అణు ప్రపంచ యుద్ధంగా పరిణమించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. 2024లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని డొనాల్డ్‌ ట్రంప్‌ ఇప్పటికే ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని