Iguana Island: అమ్మకానికి ఐలండ్.. ధరెంతో తెలుసా?

ముంబయిలోని ఖరీదైన ప్రాంతంలో ఒక అపార్ట్‌మెంట్ కొనే ధరకే ఓ  ద్వీపాన్ని సొంతం చేసుకోవచ్చని తెలుసా..? ఎక్కడనేగా మీ సందేహం? భారత్‌లో మాత్రం కాదు. 

Updated : 18 Jan 2023 16:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సొంతిల్లు ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కానీ, పెరుగుతున్న జీవన వ్యయం, ఆకాశాన్నంటుతున్న భూముల ధరలతో చాలా మంది మధ్య తరగతి వారికి సొంతిల్లు ఒక కలగానే మిగిలిపోతుంది. మరోవైపు సంపన్న వర్గాలు తమ అభిరుచికి తగినట్లుగా విలాసవంతమైన ఇంటిని నిర్మించుకోవాలని అనుకుంటారు. అలాంటి వారికి కూడా ముంబయి వంటి మహానగరంలో కోట్లు కుమ్మరించినా.. అపార్ట్‌మెంట్‌ మించి కొనలేని పరిస్థితి. అక్కడ ధరలు ఓ రేంజ్‌లో ఉంటాయి మరి. అయితే, ముంబయిలోని ఖరీదైన ప్రాంతంలో ఒక అపార్ట్‌మెంట్ కొనే ధరకే ఓ ద్వీపాన్ని (Island) సొంతం చేసుకోవచ్చని తెలుసా? ఎక్కడనేగా మీ సందేహం? భారత్‌లో మాత్రం కాదు. 

ఈ ద్వీపం మధ్య అమెరికాలోని నికరాగువా (Nicaragua) దేశంలో బ్లూఫీల్డ్స్ అనే ప్రాంతం నుంచి 19.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీని పేరు ఇగువానా ఐలండ్‌ (Iguana Island). సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ద్వీపంలో కొబ్బరి, అరటి చెట్ల మధ్య మూడు గదుల విలాసవంతమైన ఇల్లు ఉంది. ఇందులో హాల్‌, కిచెన్‌, బార్‌, లివింగ్‌ ఏరియాతోపాటు పనివారి కోసం ప్రత్యేకంగా కొన్ని గదులు కూడా ఉన్నాయి. ఇంటి బయట స్విమ్మింగ్‌ పూల్‌, ఫిష్‌ డాక్‌ను నిర్మించారు. ద్వీపానికి చుట్టూ ఉన్న ప్రకృతి ఆందాలను చూసేందుకు 28 అడుగుల వాచ్‌ టవర్ కూడా ఉంది. వైఫై, టీవీ, ఫోన్ వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి. 

ఈ ద్వీపాన్ని సొంతం చేసుకోవాలనుకునేవారు ప్రైవేట్ ఐలండ్‌ ఆన్‌లైన్‌ అనే వెబ్‌సైట్‌లోకి వెళ్లి నికరాగువా ప్రాంతంపై క్లిక్ చేస్తే ఇగువానా ఐలండ్‌ వివరాలు కనిపిస్తాయి. వెబ్‌సైట్‌ ప్రకారం ఈ ద్వీపం ధర 475 వేల డాలర్లు. భారత కరెన్సీలో సుమారు ₹3.87 కోట్లు.  ప్రస్తుతం ఈ ద్వీపాన్ని ఇంకా ఎవరూ కొనుగోలు చేయలేదు. ఆన్‌లైన్‌ వేలంలో పాల్గొని సొంతం చేసుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు