Nikki Haley: చైనా యుద్ధానికి సిద్ధమవుతోంది.. జాగ్రత్త : నిక్కీహేలీ కీలక వ్యాఖ్యలు
చైనా యుద్ధానికి సిద్ధమవుతోందని, జాగ్రత్తగా ఉండాలంటూ అమెరికా (America) అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ఉన్న నిక్కీహేలీ కీలక వ్యాఖ్యలు చేశారు.
వాషింగ్టన్: ‘అమెరికాకు (America) మాత్రమే కాదు యావత్ ప్రపంచం మొత్తానికి చైనా (China) పెద్ద ముప్పుగా ఉంది. ఆ దేశం యుద్ధానికి సిద్ధమవుతోంది. అందరూ జాగ్రత్తగా ఉండాలి’ అని అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ఉన్న నిక్కీ హేలీ (Nikki Haley) కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం న్యూహ్యాంప్‌షైర్‌లో ఏర్పాటు చేసిన ఆర్థికవ్యవస్థ విధి, విధానాలపై ఏర్పాటు చేసిన ప్రసంగంలో చైనాను ఉద్దేశించి ఈ హెచ్చరికలు చేశారు.
చైనాను ఎదుర్కొనేందుకు చాలా శక్తి అవసరం
‘అమెరికాకు చైనా (China) తో ప్రమాదం పొంచి ఉంది. అది యుద్ధానికి సిద్ధమవుతోంది. అమెరికాను ఓడించేందుకు చైనా 50 ఏళ్ల నుంచి పన్నాగాలు పన్నుతోంది. కొన్ని విషయాల్లో చైనా సైన్యం ఇప్పటికే అమెరికా సాయుధ బలగాలతో సమానంగా ఉంది. మన దేశ మనుగడకు, ముఖ్యంగా కమ్యూనిస్టు చైనాను ఎదుర్కోనేందుకు బలం, ఆత్మాభిమానం చాలా అవసరం. చైనా మన వాణిజ్య రహస్యాలను తెలుసుకుంటోంది. వారు మనపై గెలవాలని భావిస్తున్నారు’ అని ఆమె పేర్కొన్నారు.
రాజకీయ నాయకులకే కాదు ప్రభుత్వ అధికారులకు కూడా ఐదేళ్లే కాలపరిమితి ఉండాలి..
అనంతరం ఆమె ఆర్థిక ప్రణాళికను పంచుకుంటూ..‘ మధ్య తరగతి ప్రజలకు నిజమైన ఆర్థిక స్వేచ్ఛను అందించడానికి బలంగా కృషి చేస్తా. మీ డబ్బును మీరే మెరుగ్గా ఉపయోగించుకోగలరు. మీరందరూ మన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తారని నమ్మకం ఉంది. ఫెడరల్ గ్యాస్, డీజిల్ పన్నును పూర్తిగా తొలగిస్తాం. దాని వల్ల రికార్డు స్థాయి గ్యాస్ ధరలతో పోరాడుతున్న కుటుంబాలకు మేలు కలుగుతుంది. దేశ అధ్యక్షురాలిగా ఎన్నికైతే.. శ్రామిక కుటుంబాలకు ఆదాయపు పన్ను తగ్గిస్తా. బైడెన్ ప్రభుత్వం చేపట్టిన 500 బిలియన్ డాలర్ల గ్రీన్ ఎనర్జీ సబ్సిడీలను కూడా తొలగిస్తా. దీంతో శత్రుదేశానికి మన దేశం నుంచి ఆర్థిక ద్వారాలు మూసుకుపోతాయి. రాజకీయ నాయకులకు మాత్రమే కాకుండా ప్రభుత్వ అధికారులకు కూడా ఐదేళ్లకు మించి ఒకే పదవిలో ఉండకూడదు. కాలపరిమితిని అమలు చేయడం వల్ల వారూ మంచి ప్రజా సేవకులుగా పనిచేస్తారు. అంతేకాకుండా మన ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించే రాజకీయాలకు దూరంగా ఉంటారు’ అని అన్నారు.
వివేక్ రామస్వామి (Vivek Ramaswamy) ఒహియోలో చైనాపై విదేశాంగ విధాన ప్రసంగం చేసిన రెండు రోజుల తర్వాత నిక్కీ హేలి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Iraq: ఇరాక్‌లో బాంబు దాడి.. 10 మంది మృతి
ఇరాక్‌లోని దియాలా ప్రావిన్స్‌లో స్థానిక ఎంపీ బంధువులపై బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో పది మంది మృతి చెందగా.. మరో 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. -
రామస్వామి అభ్యర్థిత్వానికి ఎదురుదెబ్బలు
అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికల బరిలో దిగేందుకు రిపబ్లికన్ పార్టీ నామినేషను కోసం పోటీపడుతున్న భారత సంతతి అమెరికన్ వివేక్ రామస్వామి (38)కి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. -
భూతాపంలో 2023 కొత్త రికార్డు
వాతావరణ రికార్డుల్లో 2023 అత్యుష్ణ సంవత్సరంగా నిలిచిపోనుందని ఐక్యరాజ్య సమితికి అనుబంధమైన ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) గురువారం తెలిపింది. -
చర్చల ప్రసక్తే లేదన్న ఉత్తర కొరియా
తాము ఇటీవల నిర్వహించిన గూఢచారి ఉపగ్రహ ప్రయోగాన్ని అమెరికా ఖండించడంపై ఉత్తర కొరియా అధ్యక్షుడి సోదరి కిమ్ యో జాంగ్ గురువారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. -
ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలు సింగపూర్, జ్యూరిచ్
ఈ ఏడాది ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలుగా సింగపూర్, జ్యూరిచ్ నిలిచాయని ‘ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్’ (ఈఐయూ) తెలిపింది. -
97కు చేరిన బందీల విడుదల
ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణను గురువారం ఉదయం మరో రోజుకు పొడిగించారు. వాస్తవానికి గురువారం ఉదయం 7 గంటలకు ఒప్పందం ముగియాల్సి ఉంది. -
అమెరికా దౌత్యవేత్త హెన్రీ కిసింజర్ మృతి
ప్రచ్ఛన్న యుద్ధం సమయంలో అమెరికా విదేశాంగ విధానాన్ని తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ దౌత్యవేత్త హెన్రీ కిసింజర్(100) బుధవారం కనెక్టికట్‌లోని తన స్వగృహంలో కన్నుమూశారు. -
మొదటి నుంచీ అదే చెబుతున్నాం
సిక్కు వేర్పాటువాది హత్యకు కుట్ర పన్నిన భారతీయుడిపై అమెరికా అభియోగాలను మోపడంద్వారా మేం చెబుతున్న వాదనలకు బలం చేకూరిందని కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో వ్యాఖ్యానించారు. -
తూర్పు ఉక్రెయిన్‌పై రష్యా దాడులు
తూర్పు ఉక్రెయిన్‌లోని దొనెట్స్క్ ప్రాంతంపై గురువారం రష్యా ఎస్-300 క్షిపణులు విరుచుకుపడ్డాయి. ఈ దాడిలో పలు నివాస గృహాలు ధ్వంసమయ్యాయి. -
ఓస్ప్రేల నిలిపివేత!
అమెరికా వైమానిక దళానికి చెందిన ఓస్ప్రే విమానం సాగర జలాల్లో కూలిపోయిన నేపథ్యంలో జపాన్ పునరాలోచనలో పడింది. తన వద్ద ఉన్న ఇదే తరహా విమానాల కార్యకలాపాలను కొంతకాలం పాటు నిలిపివేయాలని భావిస్తోంది. -
‘మరింత అణుశక్తి కావాలి’
వాతావరణ మార్పులపై పోరాటానికి మరింత అణుశక్తి కావాల్సి ఉందని, పెరుగుతున్న విద్యుత్తు అవసరాలకు ఇది ఎంతో ముఖ్యమని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ డైరెక్టర్ జనరల్ రఫేల్ మారియానా గ్రాసీ పేర్కొన్నారు.