Russia crude oil: ‘క్రూడ్‌పై డిస్కౌంట్‌ మాకూ ఇవ్వండి’.. పాక్‌ అభ్యర్థనకు రష్యా నో

క్రూడాయిల్‌పై తమకూ డిస్కౌంట్‌ ఇవ్వాలని పాకిస్థాన్‌ రష్యాను కోరింది. అందుకు ఆ దేశం సున్నితంగా తిరస్కరించింది.

Published : 02 Dec 2022 01:07 IST

ఇస్లామాబాద్‌: ఉక్రెయిన్‌పై పశ్చిమ దేశాల ఆంక్షల నేపథ్యంలో తక్కువ ధరకే క్రూడాయిల్‌ను విక్రయిస్తోంది రష్యా. దీంతో భారత్‌ సహా పొరుగు దేశం చైనా ఆ దేశం నుంచి భారీగా క్రూడాయిల్‌ను దిగుమతి చేసుకుని తమ దిగుమతి బిల్లులను తగ్గించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తమకూ డిస్కౌంట్‌ ఇవ్వాలని పాకిస్థాన్‌ రష్యాను కోరగా.. అందుకు మాస్కో తిరస్కరించింది.

పాకిస్థాన్‌కు చెందిన బృందం ఇటీవల మూడు రోజుల పర్యటన కోసం రష్యా వెళ్లింది. ఈ సందర్భంగా రష్యా అధికారులతో ఆ బృందం చర్చలు జరిపింది. ఇందులో భాగంగా క్రూడాయిల్‌పై తమకూ 30-40 శాతం డిస్కౌంట్‌ ఇవ్వాలని ప్రతిపాదించింది. అందుకు మాస్కో సున్నితంగా తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పెద్ద కొనుగోలుదారుల సరఫరాకు కట్టుబడి ఉన్నామని, ఇప్పటికైతే ఎలాంటి హామీ ఇవ్వలేమని రష్యా పేర్కొన్నట్లు సమాచారం. అయితే పాకిస్థాన్‌ అభ్యర్థనను పరిశీలిస్తామని రష్యా చెప్పినట్లు మాత్రం తెలిసింది. దీంతో ఎలాంటి హామీ లేకుండానే చర్చలు ముగిశాయి. ఆర్థిక వ్యవస్థ పతనమై అల్లాడుతున్న వేళ పాకిస్థాన్‌కు ఓ విధంగా ఇది భంగపాటే అని చెప్పాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని