Pakistan: నిండుకున్న విదేశీ మారక నిల్వలు.. పతనం అంచున పాకిస్థాన్..!
పాకిస్థాన్ (Pakistan) ఆర్థిక వ్యవస్థ రోజురోజుకు దిగజారుతోంది. అక్కడి సెంట్రల్ బ్యాంకులో విదేశీ మారక నిల్వలు ఎనిమిదేళ్ల కనిష్ఠానికి పడిపోయాయి. విదేశీ దిగుమతుల కోసం ఇవి మూడు వారాలకు మాత్రమే సరిపోతాయని అక్కడి మీడియా వెల్లడించింది.
ఇస్లామాబాద్: ఆర్థిక సంక్షోభంతో పాకిస్థాన్(Pakistan)లో పరిస్థితులు రోజురోజుకు దిగజారిపోతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ప్రజలకు నిత్యావసరాలు అందించలేని దుస్థితిలో ఉన్న దాయాది దేశంలో విదేశీ మారక నిల్వలు (Foreign Exchange Reserves) వేగంగా క్షీణిస్తున్నాయని స్థానిక మీడియా వెల్లడించింది. పాకిస్థాన్ సెంట్రల్ బ్యాంకులో ఇవి ఎనిమిదేళ్ల కనిష్ఠానికి పడిపోయినట్లు తెలిపింది. ఆర్థిక వ్యవస్థ (Economy) పతనం అంచుకు చేరుకుందనే భయాలు నెలకొన్న వేళ.. తాజా పరిస్థితులు పాక్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. ఉద్యోగుల జీతాలు, పౌరులకు అందించే సబ్సిడీ పథకాల్లో కోత, విద్యుత్ వినియోగంపై వంటి ఆంక్షలను కొంతకాలంగా అమలు చేస్తోంది. అయినా.. పరిస్థితులు కుదుటపడకపోగా.. రోజురోజుకు క్షీణిస్తున్నాయి! డిసెంబర్ 30, 2022 నాటికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ (SBP) మారక నిల్వలు 5.5 బిలియన్ అమెరికన్ డాలర్లకు పడిపోయినట్లు పాక్ వార్తాపత్రిక ‘ది డాన్’ వెల్లడించింది. చివరి వారంలో కేవలం రుణాల చెల్లింపులకే 245 మిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్లు అంచనా.
గతేడాది(2022) జనవరిలో పాకిస్థాన్ విదేశీమారక నిల్వలు 16.6 బిలియన్ డాలర్లుగా ఉంది. ఏడాది చివరి నాటికి వచ్చేసరికి 11 బిలియన్ డాలర్లు క్షీణించి 5.6 బి.డాలర్లకు పడిపోయింది. ఇవి మూడు వారాల దిగుమతులకు మాత్రమే సరిపోతాయని అంచనా. వాణిజ్య బ్యాంకులతో కలిపి మొత్తంగా దేశంలో విదేశీ మారక నిల్వలు సుమారు 11.4 బిలియన్ డాలర్లు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా భారీస్థాయిలో మారక నిల్వలు తరిగిపోతుండటంతో అమెరికన్ డాలర్‌తోపాటు ఇతర కరెన్సీలతో పాకిస్థాన్ కరెన్సీ విలువ కూడా పతనమవుతోంది. ఇదే సమయంలో మిత్రదేశాలు, అంతర్జాతీయ సంస్థల నుంచి ఆశించిన మేర సాయం అందకపోవడంతో విదేశీ రుణాలు చెల్లించేందుకు దాయాది దేశానికి కష్టంగా మారింది.
దివాలా అంచుకు చేరుకున్న ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకుగానూ అంతర్జాతీయ సంస్థలు, విదేశీ రుణాల కోసం పాకిస్థాన్ ప్రయత్నాలు చేస్తోంది. కానీ, ఇప్పటివరకు వాటి నుంచి ఆశించినంత సాయం అందలేదని తెలుస్తోంది. ఇదే సమయంలో మరిన్ని రుణాలు కోసం ప్రయత్నిస్తోన్న పాక్‌కు.. విదేశీ బ్యాంకులు భారీగా అపరాధ రుసుం వేస్తున్నట్లు సమాచారం. డాలరుతో పోలిస్తే ప్రస్తుతం పాక్ రూపాయి విలువ రూ.228కి పడిపోయినట్లు అక్కడి సెంట్రల్ బ్యాంక్(ఎస్‌బీపీ) పేర్కొంది. ఎస్‌బీపీ వద్ద విదేశీ మారక నిల్వలు అట్టడుగుస్థాయికి చేరుకుంటున్న తరుణంలో విదేశీ సంస్థలు.. ఆర్థిక సాయం అందిస్తాయని పాకిస్థాన్ ఆర్థికశాఖ మంత్రి ఇషాక్ దార్ కొంతకాలంగా ఆశాభావం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ పాక్ ఆర్థిక పరిస్థితి మాత్రం పతనం అంచుకు చేరుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోందని అంతర్జాతీయ నివేదికలు అంచనా వేస్తున్నాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND vs PAK: కుర్రాళ్లు కేక.. ఫైనల్లో పాకిస్థాన్‌పై విజయం
-
Politics News
Bhimavaram: భీమవరంలో జనసేన-వైకాపా ఫ్లెక్సీ వార్
-
India News
42 ఏళ్ల వయసులో అదృశ్యమై... 33 ఏళ్ల తర్వాత ఇంటికి!
-
Ts-top-news News
సిద్దిపేట శివారులో.. త్రీడీ ప్రింటింగ్ ఆలయం
-
India News
‘స్క్విడ్ గేమ్’ పోటీలో విజేతగా భారతీయుడు
-
Politics News
పార్టీని విలీనం చేయను.. పొత్తులు పెట్టుకోను