PM Modi: ‘మీతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’.. పుతిన్‌కు ప్రధాని మోదీ విషెస్‌

రష్యా అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైన పుతిన్‌కు ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ శుభాకాంక్షలు తెలిపారు. 

Published : 18 Mar 2024 18:37 IST

దిల్లీ: వ్లాదిమిర్ పుతిన్‌(Putin).. రష్యా(Russia)కు తిరుగులేని నాయకుడిగా నిలిచారు. ఆయన మరోసారి అధ్యక్షుడిగా ఎన్నిక కావడంపై ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ‘‘ రష్యా అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైనందుకు మీకు శుభాకాంక్షలు. రాబోయే రోజుల్లో భారత్‌-రష్యాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు మీతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నాను’’ అని ప్రధాని ట్వీట్ చేశారు. 

పుతిన్‌కు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ కూడా అభినందనలు తెలియజేశారు. ‘మీరు మళ్లీ ఎన్నిక కావడం చూస్తుంటే.. రష్యా ప్రజల నుంచి మీకు అందుతోన్న మద్దతు స్పష్టంగా కనిపిస్తోంది. సవాళ్లను ఎదుర్కొనేందుకు, దేశం స్థిరమైన అభివృద్ధి దిశగా పయనించేందుకు ఇటీవల కాలంలో మీ దేశ ప్రజలంతా ఏకమయ్యారు. మీ నాయకత్వంలో రష్యా మరిన్ని విజయాలు సాధిస్తుందని విశ్వసిస్తున్నాను. మన రెండు దేశాల బంధానికి మేం అత్యంత ప్రాముఖ్యత ఇస్తాం’ అని జిన్‌పింగ్ తన అభినందన సందేశంలో పేర్కొన్నారు.

గూఢచారి నుంచి అధ్యక్షుడి వరకు.. 24 ఏళ్లుగా అధికారంలోనే!

మూడురోజుల పాటు జరిగిన ఎన్నికల్లో పుతిన్ భారీ విజయాన్ని అందుకున్నారు. సుమారు 87 శాతం ఓటింగ్‌ సాధించారు. తాజా ఫలితంతో మరో ఆరేళ్ల పాలనను ఆయన చేతుల్లోనే ఉంచుకోనున్నారు. గత 24 ఏళ్లుగా అధికారంలో (ప్రధానిగా, అధ్యక్షుడిగా కలిపి) కొనసాగుతోన్న ఆయన.. ఈ పదవీకాలం పూర్తయితే రష్యాను (Russia) సుదీర్ఘకాలం పాలించిన నేతగా రికార్డు సృష్టించనున్నారు. బలమైన ప్రత్యర్థులు గానీ, బహిరంగంగా విమర్శించేవారు గానీ లేని కఠినమైన వాతావరణంలో ఎన్నికలు జరిగాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని