Jaishankar: ఆస్ట్రేలియా ఉపప్రధానికి జైశంకర్‌ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌..!

క్రికెట్‌ భారత్‌-ఆస్ట్రేలియా సంబంధాలపై కూడా సానుకూల ప్రభావం చూపుతోంది. ఇరు దేశాలకు క్రికెట్‌ జగత్తులో దిగ్గజ జట్లు ఉన్నాయి. ఇక రెండు చోట్ల క్రికెట్‌ అభిమానులకు కొదవే లేదు.

Published : 12 Oct 2022 01:11 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: క్రికెట్‌ భారత్‌-ఆస్ట్రేలియా సంబంధాలపై కూడా సానుకూల ప్రభావం చూపుతోంది. ఇరు దేశాలకు క్రికెట్‌ జగత్తులో దిగ్గజ జట్లు ఉన్నాయి. ఇక రెండు చోట్ల క్రికెట్‌ అభిమానులకు కొదవే లేదు. తాజాగా భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్‌ ఆస్ట్రేలియా ఉపప్రధాని రిచర్డ్‌ మార్లెస్‌కు ఓ క్రికెట్‌ గిఫ్ట్‌ ఇచ్చారు. ఈ గిఫ్ట్‌ను చూసి మార్లెస్‌ కూడా ఆశ్చర్యపోయారు. ఆ విషయాన్ని ఆయన స్వయంగా ట్విటర్‌లో పంచుకొన్నారు. 

న్యూజిలాండ్‌ పర్యటన ముగించుకొన్న భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ నిన్న ఆస్ట్రేలియాకు చేరుకొన్నారు. ఆయన అక్కడ పలు సమావేశాల్లో పాల్గొని బిజీబిజీగా గడిపారు. ఈ క్రమంలో ఆయన ఆస్ట్రేలియా ఉపప్రధాని రిచర్డ్‌ మార్లెస్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భారత లెజెండ్‌ విరాట్‌ కోహ్లీ సంతకం చేసిన ఓ బ్యాట్‌ను రిచర్డ్‌కు బహూకరించారు. ఈ గిఫ్ట్‌తో రిచర్డ్‌ ఆశ్చర్యపోయారు. దీనిని ఆయన ట్విటర్లో షేర్‌ చేశారు. ‘‘డాక్టర్‌ జైశంకర్‌కు ఆతిథ్యమివ్వడం సంతోషంగా ఉంది. చాలా విషయాలు మమ్మల్ని కలిపి ఉంచుతాయి. వీటిల్లో క్రికెట్‌పై ప్రేమకూడా ఒకటి. ఈ రోజు ఆయన విరాట్‌ సంతకం చేసిన బ్యాట్‌ను ఇచ్చి ఆశ్చర్యానికి గురిచేశారు’’ అని పేర్కొన్నారు. అనంతరం ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ప్రాంతీయ భద్రత, రక్షణ రంగ సహకారం, ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో పరిణామాలు వంటి అంశాలు వీరి మధ్య చర్చకు వచ్చాయి. రిచర్డ్‌ ఆస్ట్రేలియా రక్షణశాఖ మంత్రిగా కూడా వ్యవహరిస్తున్నారు. 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని