Talibans: వేలాది మంది చూస్తుండగా.. స్టేడియంలో మరణ దండన

  ఓ హత్య కేసులో దోషులుగా తేలిన ఇద్దరు వ్యక్తులకు.. అఫ్గానిస్థాన్‌లో అధికారంలో ఉన్న తాలిబన్లు బహిరంగంగా మరణ శిక్షను అమలు చేశారు.

Published : 22 Feb 2024 19:12 IST

కాబూల్‌: తాలిబన్లు (Taliban) అఫ్గానిస్థాన్‌ (Afghanistan)లో తమ అరాచక పాలనకు మరోసారి తెరతీసినట్లు కనిపిస్తోంది. ఓ హత్య కేసులో దోషులుగా తేలిన ఇద్దరు వ్యక్తులకు బహిరంగంగా శిక్ష అమలుచేశారు. అందరూ చూస్తుండగానే వారిని పిట్టల్లా కాల్చి చంపేశారు. ఈ ఘటన తూర్పు అఫ్గానిస్థాన్‌లోని ఓ ఫుట్‌బాల్‌ స్టేడియంలో గురువారం చోటుచేసుకొంది.

రెండేళ్ల క్రితం జరిగిన ఓ హత్య కేసులో ఈ ఇద్దరు వ్యక్తులు నిందితులుగా ఉన్నారు. అప్పటినుంచి విచారణ చేపట్టిన అక్కడి సుప్రీంకోర్టు వీరికి మరణశిక్ష విధించింది. బహిరంగంగా శిక్షను అమలుచేయాలంటూ ఆదేశించింది. దీంతో ఫుట్‌బాల్‌ కోర్టులో అందరూ చేస్తుండగానే దోషులకు మరణదండన అమలుచేసినట్లు మీడియా కథనాలు ప్రచురించాయి. ఈ శిక్షను చూసేందుకు హాజరైన వేలాదిమందిలో దోషుల కుటుంబాలు కూడా ఉన్నట్లు పేర్కొంది.

నౌక ఢీకొని భారీ వంతెన రెండు ముక్కలు..!

గతంలోనూ దొంగతనం ఆరోపణలపై కాందహార్‌ ఫుట్‌బాల్‌ స్టేడియంలో ప్రజలందరి ముందు తాలిబన్లు నలుగురు వ్యక్తుల చేతులను నరికేశారు. సరైన న్యాయవిచారణ జరపకుండా ప్రజలకు శిక్షలు విధిస్తున్నారని.. ఇది మానవ హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుందని అఫ్గాన్‌ ప్రభుత్వంలో గతంలో విధాన సలహాదారుగా పనిచేసిన షబ్నమ్‌ నాసిమి వెల్లడించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని