America: ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా.. మధ్యధరా సముద్రంలోకి మరో విమాన వాహక నౌక

ఇజ్రాయెల్‌ ( Israel)పై హమాస్‌ చర్యలను అడ్డుకునేందుకు అమెరికా మరో యుద్ధ విమాన వాహక నౌకను రంగంలోకి దింపింది. 

Updated : 15 Oct 2023 12:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హమాస్‌ (Hamas) మిలిటెంట్లకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌ ( Israel) గాజాపై దాడులను తీవ్రం చేస్తోంది. ఈ నేపథ్యంలో టెల్‌అవీవ్‌కు అమెరికా (America) పూర్తి మద్దతు తెలిపింది. ఈ క్రమంలోనే అగ్రరాజ్యం నుంచి ఇజ్రాయెల్‌కు ఆయుధ సాయం అందుతోంది. తాజాగా మరో విమాన వాహక నౌకను మధ్యధరా సముద్రంలో మోహరించింది.

ఇజ్రాయెల్‌-హమాస్‌ పోరులో మూడో దేశం జోక్యం చేసుకోకుండా అరికట్టేందుకు ఈ నౌకను అమెరికా పంపింది. దీంతో పాటు యూఎస్‌ఎస్‌ ఐసన్‌హోవర్‌ తన క్యారియర్‌ స్ట్రైక్‌ గ్రూప్‌తో ఇజ్రాయెల్‌ తీరానికి తరలించింది. ఇప్పటికే అక్కడ ఉన్న ద యూఎస్‌ఎస్‌ గెరాల్డ్‌ ఆర్‌ ఫోర్డ్‌ వాహక నౌక బృందంతో కలిసి పనిచేయనుంది. ‘‘ఇజ్రాయెల్‌ రక్షణకు అమెరికా కట్టుబడి ఉందనే విశ్వాసం కల్పించేందుకు, మూడో దేశం లేదా గ్రూపు ఈ వివాదంలో జోక్యం చేసుకొనే ముప్పును నివారించడానికి ఈ నిర్ణయం తీసుకొన్నాం’’ అని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ వెల్లడించారు.

మానవతా సంక్షోభ నివారణకు అమెరికా ముమ్మర యత్నాలు!

ఈ గ్రూప్‌లో డిస్ట్రాయర్లు, ఇతర సహాయక నౌకలు, ఎఫ్‌-35, ఎఫ్‌-15, ఎఫ్‌-16, ఏ-10 యుద్ధ విమానాలు ఉంటాయి. ఇదిలా ఉండగా.. హమాస్‌- ఇజ్రాయెల్‌ మధ్య కొనసాగుతున్న భీకర పోరులో ఇరువైపుల దాదాపు 3,500 మందికి పైగా మరణించారు. ఇజ్రాయెల్‌ జరుపుతున్న ప్రతిదాడిలో 2,200 మందికి పైగా గాజా పౌరులు ప్రాణాలు కోల్పోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని