Ambati Rambabu: వర్షాలు లేవు.. వరి సాగు చేయకండి: మంత్రి అంబటి సూచన

వర్షాలు తక్కువగా పడటం వలన సాగర్‌ ఆయకట్టు పరిధిలోని రైతులు వరి పంటను సాగు చేయవద్దని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) అన్నారు. గుంటూరు కలెక్టరేట్‌లో నీటి సలహమండలి, వ్యవసాయ సలహా మండలి ప్రత్యేక సమావేశం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆగష్టు నెలలో తక్కువగా వర్షాలు కురిశాయని, అందువల్ల నాగార్జున సాగర్‌లో నీరు తక్కువగా ఉందన్నారు. వర్షాలు సమృద్ధిగా పడితే సాగుకు నీటిని రోజు విడుదల చేస్తామని, వర్షాలు పడకపోతే వారబందీ అమలు చేస్తామన్నారు. రైతులు ఆరుతడి పంటలు వేసుకోవాలని, ఉన్న నీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Published : 07 Sep 2023 16:44 IST

Tags :

మరిన్ని