Laxman: ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చేలా రేవంత్‌ మాటలు: ఎంపీ లక్ష్మణ్‌

ముఖ్యమంత్రి హోదా స్థాయిని దిగజార్చేలా రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారని భాజపా (BJP) రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌ (Laxman) విమర్శించారు.

Published : 01 May 2024 13:00 IST

ముఖ్యమంత్రి హోదా స్థాయిని దిగజార్చేలా రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారని భాజపా (BJP) రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌ (Laxman) విమర్శించారు. ఆయన మాటల్లో పస లేదని ప్రజలు గుర్తించారన్నారు. నాంపల్లిలోని భాజపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రిజర్వేషన్లపై కాంగ్రెస్‌, భారాస నేతలు చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మరన్నారు. ఆఖరికి ఫేక్‌ వీడియోలు సృష్టించే స్థాయికి రేవంత్‌రెడ్డి దిగజారారని విమర్శించారు.

Tags :

మరిన్ని