AP News: తెదేపా-జనసేన మ్యానిఫెస్టోపై సర్వత్రా హర్షం

మిత్రపక్షం భాజపా సూచనలు, సలహాలకు ప్రాధాన్యమిస్తూ, తెదేపా, జనసేనలు మంగళవారం విడుదల చేసిన సంయుక్త మ్యానిఫెస్టోతో ఎన్‌డీయేలోని మూడు పార్టీల్లో ఉత్సాహం ఉరకలు వేస్తోంది.

Published : 01 May 2024 09:53 IST

తెదేపా, జనసేన మ్యానిఫెస్టో సూపర్‌ హిట్‌..! అది కేవలం ఎన్నికల మ్యానిఫెస్టో మాత్రమే కాదు. అభివృద్ధినీ, సంక్షేమాన్నీ సమతుల్యం చేస్తూ.. రాష్ట్ర భవిష్యత్తుకు మేలు బాటలు వేసేందుకు రూపొందించిన దార్శనిక పత్రం! అణగారిన వర్గాలకు ఆర్థికంగా అండగా నిలుస్తూ, వారి సామాజిక అభ్యున్నతికి భరోసానిచ్చేందుకు ఎంతో శ్రద్ధతో రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక! వైకాపా ఐదేళ్ల అరాచక పాలనలో విధ్వంసానికి గురైన వ్యవస్థల్ని మళ్లీ గాడిలో పెట్టేందుకు, దెబ్బతిన్న వర్గాలకు భరోసానిచ్చేందుకు మ్యానిఫెస్టోలో విస్తృత కసరత్తు చేశారు. మిత్రపక్షం భాజపా సూచనలు, సలహాలకు ప్రాధాన్యమిస్తూ, తెదేపా, జనసేనలు మంగళవారం విడుదల చేసిన సంయుక్త మ్యానిఫెస్టోతో ఎన్‌డీయేలోని మూడు పార్టీల్లో ఉత్సాహం ఉరకలు వేస్తోంది.

Tags :

మరిన్ని