వివేకా హత్యకేసు నిందితులకు బెయిలివ్వొద్దు: తెలంగాణ హైకోర్టుకు నివేదించిన సీబీఐ

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో మాజీ ఐఏఎస్‌ స్థాయి అధికారులనే ప్రభావితం చేయగల నిందితులకు సామాన్యులైన సాక్షులు ఓ లెక్క కాదంటూ సీబీఐ సోమవారం తెలంగాణ హైకోర్టుకు నివేదించింది. వైఎస్‌ భాస్కర్‌రెడ్డి వంటి పలుకుబడి గల నిందితులు బయట ఉంటే సాక్ష్యం చెప్పడానికి ఎవరూ ముందుకురారని, భవిష్యత్తులో కింది కోర్టు విచారణ ప్రక్రియ ఏవిధంగా ఉంటుందో ఊహించుకోవచ్చని పేర్కొంది. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరికి వ్యతిరేకంగా పోలీసు, ఏపీ ప్రభుత్వ వ్యవస్థలు పని చేస్తున్నాయని గుర్తుచేసింది. ప్రస్తుతం అభియోగాల నమోదు ప్రక్రియ నడుస్తోందని, నిందితులు విచారణకు ఆటంకాలు సృష్టిస్తున్నారని, ఈ దశలో బెయిలిస్తే పారదర్శక విచారణకు అడ్డంకులు తప్పవని సీబీఐ పేర్కొంది.

Published : 09 Apr 2024 11:38 IST

Tags :

మరిన్ని