తీన్‌మార్‌ బ్యూటీ.. ఈ బర్త్‌డే బేబీ!

తాజావార్తలు

తీన్‌మార్‌ బ్యూటీ.. ఈ బర్త్‌డే బేబీ!
హైదరాబాద్‌: ఏమాయ చేసావేతో కుర్రకారు మనసులు దోచుకున్న కుందనపు బొమ్మ సమంత. తెలుగు, తమిళంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ భామ వచ్చే నెలలో మూడు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. పవన్‌కల్యాణ్‌, నాగార్జున, మహేశ్‌బాబు, ఎన్టీఆర్‌ వంటి టాప్‌ హీరోలతో నటించిన సమంత ఈరోజు తన 29వ పుట్టిన రోజును జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు త్రిష, హన్సిక, కోనా వెంకట్‌, తాప్సి తదితరులు ట్విట్టర్‌ ద్వారా సమంతకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దీంతోపాటు ట్విట్టర్‌లో సమంతకి అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

ప్రస్తుతం సమంత... మహేశ్‌బాబు సరసన ‘బ్రహ్మోత్సవం’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం మే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు సమాచారం. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు‘, ‘దూకుడు’ చిత్రాల్లో మహేశ్‌తో జత కట్టి అలరించిన ఈ బ్యూటీ... మూడోసారి బ్రహ్మోత్సవంతో ఇంకెలా ఆకట్టుకోనుందో వేచి చూడాలి.

సూర్య, సమంత జంటగా నటించిన ‘24’ చిత్రం మే 6న విడుదల కానుంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ట్రైలర్‌కు వస్తున్న విశేష స్పందన సినిమాపై అంచనాలను పెంచుతోంది. సూర్య త్రిపాత్రాభినయంలో నటించిన ఈ చిత్రంతో నిత్యా మేనన్‌ మరో కథానాయికగా నటించారు. ఇది కాలంతో ముడిపడి నడిచే సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌.

నితిన్‌, సమంత జంటగా నటించిన ‘అ..ఆ’ చిత్రం షూటింగ్‌ ఇటీవల పూర్తయింది. ఈ చిత్రాన్ని కూడా మే నెలలో విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంతో సమంత ప్రేక్షకులను ఎలా మాయ చేయబోతోందో చూడాలి.

అంతేకాదు ఎన్టీఆర్‌ హీరోగా రూపుదిద్దుకుంటున్న ‘జనతా గ్యారేజ్‌’ చిత్రంలో కూడా సమంత కథానాయికగా నటిస్తున్నారు. ఈ జంట ఇది వరకే ‘బృందావనం’, ‘రభస’ చిత్రాలతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

FileName

  • FileName
మరిన్ని
FileName

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2016 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.