బ్రేకింగ్

breaking
23 May 2024 | 15:34 IST

పిన్నెల్లి లొంగిపోతారని ప్రచారం.. పోలీసుల పహారా

నరసరావుపేట: మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లొంగిపోతారన్న అనుమానంతో పల్నాడు జిల్లా నరసరావుపేట పోలీసులు అప్రమత్తమయ్యారు. నరసరావుపేట కోర్టు ఆవరణలో పోలీసులు పహారా కాస్తున్నారు. రెంటచింతల మండలం పాల్వాయిగేటు పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో పిన్నెల్లి ఏ1 నిందితుడిగా ఉన్నారు. ఆయన కోసం ఇప్పటికే ఎస్పీ, డీఎస్పీ ఆధ్వర్యంలో 8 ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. అయితే పిన్నెల్లి కచ్చితంగా లొంగిపోతారనే విషయంపై ఎలాంటి సమాచారం లేదని పోలీసులు వెల్లడించారు.

మరిన్ని

తాజా వార్తలు