కోట్లల్లో వ్యూస్‌.. సాయిపల్లవి రికార్డులు..!
close
Published : 09/05/2020 14:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కోట్లల్లో వ్యూస్‌.. సాయిపల్లవి రికార్డులు..!

బాల్యం నుంచే...

తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల్ని ‘ఫిదా’ చేసిన ముద్దుగుమ్మ సాయిపల్లవి. ‘భానుమతి.. ఒక్కటే పీస్‌.. రెండు కులాలు.. రెండు మతాలు.. హైబ్రీడ్‌ పిల్ల..’ అంటూ ‘ఫిదా’లో ఆమె చేసిన అల్లరి అందర్నీ ఆకట్టుకుంది. పక్కింటి అమ్మాయిలా, సహజమైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఓ కథానాయికకు ఆరంభంలోనే ఇంత క్రేజ్‌ ఏర్పడటం సాధారణ విషయం కాదు. 2015లో వచ్చిన ‘ప్రేమమ్‌’ (మలయాళ) నటిగా సాయి పల్లవి అరంగేట్ర చిత్రం. ఆపై రెండేళ్లకు తెలుగు వారిని పలకరించారు. ‘మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి’, ‘కణం’, ‘పడిపడిలేచె మనసు’ తదితర చిత్రాలతో అలరించారు. త్వరలో ఆమె, నాగచైతన్య నటించిన ‘లవ్‌ స్టోరీ’ విడుదల కాబోతోంది. శనివారం ‘భానుమతి’ పుట్టినరోజు సందర్భంగా..

నటే కాదు..

సాయిపల్లవి మంచి నటే కాదు.. చక్కటి డ్యాన్సర్‌ కూడా. చిన్నతనం నుంచి అనేక డ్యాన్స్‌ షోలలో పాల్గొన్నారు. అప్పట్లోనే తన స్టెప్పులతో న్యాయనిర్ణేతల్ని ఆశ్చర్యపరిచారు. వారి ప్రశంసలు అందుకున్నారు. ఆమె నటిగా మారిన తర్వాత ఆ వీడియోలు యూట్యూబ్‌లో వైరల్‌ అయ్యాయి. అంతేకాదు సాయిపల్లవి నటించిన పలు పాటలు రికార్డులు సృష్టించాయి.

మలరేతోనే..

‘ప్రేమమ్‌’తో సాయిపల్లవి నటిగా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలోని ‘మలరే..’ అని సాగే గీతం బాగా పాపులర్‌ అయ్యింది. 5 కోట్ల మందికిపైగా ఈ పాటను యూట్యూబ్‌లో వీక్షించారు. ఇదే సినిమాను తెలుగులో ‘ప్రేమమ్‌’ టైటిల్‌తో రీమేక్‌ చేశారు. నాగచైతన్య కథానాయికుడు. సాయిపల్లవి పాత్రను శ్రుతిహాసన్‌ పోషించారు. రీమేక్‌కు కూడా ఆదరణ లభించింది.

పిల్లా మెల్లగ వచ్చిండే..

‘వచ్చిండే పిల్ల మెల్లగ వచ్చిండే..’ అంటూ సాయిపల్లవి చేసిన డ్యాన్స్‌ ‘ఫిదా’లో హైలైట్‌గా నిలిచింది. పెళ్లి సంగీత్‌లో చిత్రీకరించిన గీతం ఇది. ఈ పాటకు విశేషమైన స్పందన లభించింది. యూట్యూబ్‌లో 25 కోట్ల మందికిపైగా దీన్ని చూడటం విశేషం. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వరుణ్‌తేజ్‌ కథానాయకుడిగా నటించారు. ఈ సినిమాలో తన పాత్రకు సాయిపల్లవి డబ్బింగ్‌ చెప్పుకోవడం విశేషం.

ఏవండోయ్‌ నానిగారు..

నాని, సాయిపల్లవి సందడి చేసిన సినిమా ‘మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి’. శ్రీరామ్‌ వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమాలోని ‘ఏవండోయ్‌ నానిగారు..’ పాటలో సాయిపల్లవి డ్యాన్స్‌ అదిరిపోయింది. నానితో ఆమె వేసే స్టెప్పులు పాటకు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. దేవిశ్రీ ప్రసాద్‌ ఈ పాటకు సంగీతం అందించారు. 10 కోట్ల మందికిపైగా ఈ పాటను యూట్యూబ్‌లో వీక్షించారు.

రౌడీబేబీ..

దక్షిణాదిలో చరిత్ర సృష్టించిన తమిళ గీతం ‘రౌడీ బేబీ..’. ధనుష్‌, సాయిపల్లవి జంటగా నటించిన ‘మారి 2’లోని గీతం ఇది. ధనుష్‌ సాహిత్యం అందించి పాడారు. ప్రభుదేవా కొరియోగ్రఫీ అందించిన ఈ గీతంలో సాయిపల్లవి స్టెప్పులతో అదుర్స్‌ అనిపించుకున్నారు. ఈ పాటను యూట్యూబ్‌లో 84 కోట్ల మందికిపైగా వీక్షించడం విశేషం. దక్షిణాదిలోనే అత్యధిక వ్యూస్‌ సాధించిన పాటగా ఇది రికార్డు సృష్టించింది.

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని