MAA Elections: మా ఎన్నికల నామినేషన్ల సందడి
close
Updated : 28/09/2021 07:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

MAA Elections: మా ఎన్నికల నామినేషన్ల సందడి

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) అధ్యక్ష పదవికి నటుడు ప్రకాశ్‌ రాజ్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. సోమవారం ఉదయం తన ప్యానల్‌సభ్యులతో కలిసి నామినేషన్‌ వేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘ఇవి ఎన్నికలు కాదు పోటీ మాత్రమే. గెలిపించేది.. ఓడించేది ఓటర్లే. మేము వాళ్ల ముందు నిలుచున్నాం. గెలిపిస్తారా? ఓడిస్తారా? అనేది వాళ్ల హక్కు. వాళ్ల బాధ్యత. అక్టోబరు 3న మా ఎన్నికల ప్రణాళిక వెల్లడిస్తాం. ‘మా’ ఎన్నికల్లో రాజకీయ జోక్యం వద్దని మంచు విష్ణు మంచి మాట చెప్పారు. మేమూ అదే కోరుకుంటున్నాం. ఇది ‘మా’ సభ్యుల మధ్య జరిగే ఎన్నిక మాత్రమే. రాజకీయ జోక్యం వద్దు’’ అన్నారు. ఈ సందర్భంగా ‘రిపబ్లిక్‌’ ప్రీరిలీజ్‌ వేడుకలో పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపైనా స్పందించారు ప్రకాశ్‌ రాజ్‌. ‘‘పవన్‌ కల్యాణ్‌ ఒక రాజకీయ నాయకుడు. ఆయనకంటూ కొన్ని సిద్ధాంతాలున్నాయి. దేశం కోసం పోరాడుతున్నారు. ఆయన కూడా ‘మా’ అసోసియేషన్‌ మెంబరే. ఎవరు ఏం చెప్పినా మంచి కోసమే మాట్లాడతారు. పవన్‌ చేసిన వ్యాఖ్యలు.. దానికి వచ్చే ప్రతిఫలం బట్టి ముందుకెళ్దాం. ప్రతి ఒక్కరిలోనూ ప్రేమ, ఆవేశం ఉంటాయి. వాళ్లని మాట్లాడనివ్వండి. రాజకీయ వ్యాఖ్యలపై ఎవరూ ప్రశ్నించవద్ద’’న్నారు ప్రకాశ్‌ రాజ్‌.

చిరంజీవి ఎవరికైనా మద్దతివ్వొచ్చు..: జీవిత

‘‘చిరంజీవి మద్దతు ప్రకాశ్‌రాజ్‌కు ఉందనడానికి మా దగ్గర ఆధారాలు లేవు. ఆయన మంచు విష్ణుకు కూడా మద్దతు ఇవ్వొచ్చు. అందరికీ ఆయన ఆశీస్సులు ఉంటాయ’’న్నారు నటి జీవిత. సోమవారం ‘మా’ జనరల్‌ సెక్రటరీగా నామినేషన్‌ వేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో పోటీతత్వమే తప్ప శత్రుత్వం లేదన్నారు. ‘‘ప్రకాశ్‌ రాజ్‌ ప్యానెల్‌లో జనరల్‌ సెక్రటరీగా నామినేషన్‌ వేశా. ప్రధానమంత్రి ఎన్నికల కంటే ‘మా’ ఎన్నికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఎన్ని వివాదాలొచ్చినా.. మేమంతా ఒక్కటే. ఆరోగ్యకరమైన వాతావరణంలో ఎన్నికలు జరుగుతాయని ఆశిస్తున్నా. వ్యక్తిగత ఆరోపణలతో పరిశ్రమ పరువు దిగజార్చొద్దు. పృథ్వీ ఆరోపణలు నన్ను బాధించాయి. ఆయన వ్యాఖ్యలు చిన్న పిల్లాడిలా ఉన్నాయి. ‘మా’ అనేది తలెత్తుకుని ఉండాలి. ఎన్నికలను తప్పుదారి పట్టించొద్దు’’ అన్నారు జీవిత.

‘మా’ అధ్యక్ష అభ్యర్థిగా సీవీఎల్‌ నామినేషన్‌..

‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థిగా నటుడు సీవీఎల్‌ నర్సింహారావు నామినేషన్‌ దాఖలు చేశారు. ‘మా’ కార్యాలయంలో ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా సీవీఎల్‌, ప్రకాశ్‌ రాజ్‌ కొద్దిసేపు మాట్లాడుకున్నారు.

పేద కళాకారులకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు.. - బండ్ల గణేష్‌
‘మా’ ఎన్నికల్లో తనని ప్రధాన కార్యదర్శిగా గెలిపిస్తే.. 100మంది పేద కళాకారులకు రెండు పడక గదుల ఇళ్లు ఇప్పిస్తానన్నారు నటుడు, నిర్మాత బండ్ల గణేశ్‌. ఈ ‘మా’ ఎన్నికల్లో ఆయన ఏ ప్యానెల్‌తో సంబంధం లేకుండా సొంతంగా ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేస్తున్నారు. ఆయన సోమవారమే నామినేషన్‌ వేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘మా’ ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శిగా పోటీ చేస్తున్నా. నాది సింగిల్‌ హామీ మేనిఫెస్టో. నన్ను గెలిపిస్తే ‘మా’ కోసం బిల్డింగ్‌ కట్టను. 100మంది పేద కళాకారులకు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు ఇప్పిస్తా’’ అన్నారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని