close

తాజా వార్తలు

Updated : 19/05/2020 08:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఒకే వ్యక్తికి రెండుసార్లు కరోనా

ఈనాడు, విశాఖపట్నం: నగరంలోని ఓ కుటుంబాన్ని కరోనా పగబట్టినట్టుగా వేధిస్తోంది. ఎనిమిది మంది సభ్యులున్న ఆ కుటుంబంలో 18 నెలల చిన్నారిని సహా అందరినీ వైరస్‌ చుట్టబెట్టేసింది. అంతేకాకుండా వారిలో 30 ఏళ్ల వ్యక్తి రెండుసార్లు కొవిడ్‌ బారినపడటం ఆశ్చర్యకర విషయం. ముంబయి నుంచి వచ్చిన ఈ కుటుంబానికి చెందిన 30 ఏళ్ల వ్యక్తికి ఏప్రిల్‌ 1న కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఆ తర్వాత ఒకట్రెండ్రోజుల్లో ఆయన భార్య, 18 నెలల చిన్నారికి తప్ప అందరికీ వైరస్‌ సోకింది. వారంతా ఏప్రిల్‌ 17, 18 తేదీల నాటికి కోలుకుని ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చారు. ఐదు రోజులు తిరక్కుండానే తల్లికి పాజిటివ్‌ వచ్చింది. కొద్ది రోజులకు ఆమె కోలుకుంది. హమ్మయ్యా అనుకుంటున్న సమయంలో.. బాలుడికి, అతని తండ్రికి వైరస్‌ ఉన్నట్లు పరీక్షల్లో తేలింది(ఆ తండ్రికి వైరస్‌ సోకడం ఇది రెండోసారి). ప్రస్తుతం వీరిద్దరూ ఆసుపత్రిలో ఉండగా.. మిగిలినవారు క్వారంటైన్‌లో ఉన్నారు.

జయించిన 9 నెలల చిన్నారి
నెల్లూరు(వైద్యం), న్యూస్‌టుడే: నెల్లూరులోని కోటమిట్టకు చెందిన 9 నెలల చిన్నారి కరోనాను జయించింది. స్థానిక నారాయణ కొవిడ్‌ ఆస్పత్రిలో కొన్ని రోజులుగా చికిత్స పొంది విజయవంతంగా కోలుకుందని ఆస్పత్రి నోడల్‌ అధికారి సుబ్బారావు తెలిపారు.


Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని