close

తాజా వార్తలు

Updated : 11/04/2021 21:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9 PM

1. వైకాపా గెలిస్తే అక్రమాలకు లైసెన్స్‌ ఇచ్చినట్లే!

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో ఓటడితే అర్హత వైకాపాకు లేదని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. డబ్బు తీసుకుని ఓట్లేస్తే హక్కులు కోల్పోతారని చెప్పారు. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా నెల్లూరు జిల్లా రాపూరు, వెంకటగిరిలో నిర్వహించిన రోడ్‌షోల్లో ఆయన మాట్లాడారు. బెదిరించే వాలంటీర్లను ఎదిరించాలని ప్రజలకు చంద్రబాబు సూచించారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో వైకాపా గెలిస్తే అక్రమాలకు లైసెన్స్‌ ఇచ్చినట్లేనని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఒక్క చిత్తూరు జిల్లాలోనే 719 కేసులు!

ఏపీలో కరోనా కేసుల సంఖ్య మరింత పెరుగుతోంది.  24 గంటల వ్యవధిలో 31,719 నమూనాలను పరీక్షించగా 3,495 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 719, అత్యల్పంగా పశ్చిమగోదావరి జిల్లాలో 40 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌లో వెల్లడించింది. తాజా సంఖ్యతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 9,25,401కి చేరింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. కేటీఆర్‌ సర్‌ మీరు సినిమాల్లో ట్రై చేయలేదా?

కేటీఆర్‌ సర్‌.. మీరు హీరోలా ఉన్నారు. బాలీవుడ్‌, హాలీవుడ్‌ సినిమాల్లో ఎప్పుడూ ప్రయత్నించలేదా? అని ఓ అభిమాని ట్విటర్‌ వేదికగా అడిగిన ప్రశ్నకు తెలంగాణ మంత్రి కేటీఆర్‌ సరదాగా సమాధానం ఇచ్చారు. #AskKTR పేరుతో ఆదివారం సాయంత్రం ట్విటర్‌ వేదికగా ఆయన ముచ్చటించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ యంగ్‌ లుక్‌లో ఉన్న ఫొటోను అభిమాని పంచుకుంటూ పై ప్రశ్న అడగ్గా, అందుకు కేటీఆర్‌ బదులిస్తూ ‘‘బాలీవుడ్‌, హాలీవుడ్‌, మరీ పెద్ద చెట్టు ఎక్కిస్తున్నావ్‌’ అంటూ నవ్వుతున్న ఎమోజీని పంచుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. పరిస్థితి చేజారితే లాక్‌డౌన్‌ తప్పదు..!

దేశ రాజధాని దిల్లీలో కరోనా వైరస్‌ తీవ్రత పెరిగిన నేపథ్యంలో మరిన్ని ఆంక్షలవైపు దిల్లీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే కొవిడ్‌ రోగులతో దిల్లీలోని ఆసుపత్రులు నిండిపోతున్నాయి. ఇది ఇలాగే కొనసాగి.. ఆసుపత్రుల్లో పరిస్థితి దిగజారితే మాత్రం లాక్‌డౌన్‌ అమలు చేయడం మినహా ప్రభుత్వం దగ్గర ఎలాంటి ప్రత్యామ్నాయం లేదని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పష్టంచేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

మాస్కుతో 14వేల మంది ప్రాణాలు కాపాడవచ్చు!

5. మూడువేల ఏళ్ల నాటి ‘బంగారు నగరం’

ఈజిప్టు చారిత్రక వైభవాన్ని ప్రపంచానికి మరోసారి చాటిచెప్పే పురాతన నగరం మరొకటి బయటపడింది. ఇసుక కింద సమాధి అయిన మూడు వేల ఏళ్ల క్రితం నాటి బంగారు నగరాన్ని పురాతత్వ పరిశోధకులు గుర్తించారు. లగ్జోర్‌లో గుర్తించిన ఈ నగరంలోని అద్భుతమైన, అరుదైన కట్టడాలను చూసి ఆర్కియాలజిస్టులు ఆశ్చర్యపోతున్నారు. ఈజిప్టులో ఇప్పటివరకు కనుగొన్న పురాతన నగరాల్లో ఇదే అతిపెద్దదని వెల్లడించారు. ఈజిప్టును పాలించిన ఫారో స్వర్ణయుగంలో నిర్మించినదిగా భావిస్తున్న ఈ బంగారు నగరం నాటి ఈజిప్టు ఘన చరిత్రను మరోసారి కళ్లకు కట్టింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. నాయిని అల్లుడు శ్రీనివాస్‌రెడ్డికి ఈడీ సమన్లు

సంచలనం సృష్టించిన ఐఎంఎస్‌ కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును ముమ్మరం చేసింది. మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్‌రెడ్డి, నాయిని మాజీ వ్యక్తిగత కార్యదర్శి ముకుందరెడ్డి, ఆయన బంధువు వినయ్‌రెడ్డి, ఐఎంఎస్‌ కుంభకోణం ప్రధాన సూత్రధారి డా.దేవికారాణిలకు ఈడీ సమన్లు జారీ చేసింది. పది రోజుల్లో విచారణకు హాజరుకావాలని వారిని ఆదేశించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. వార్నర్‌ ఆర్మీ.. స్పైడీ చుట్టూ సీఎస్కే ఆటగాళ్లు.. 

 ఐపీఎల్‌ 14వ సీజన్‌ ఘనంగా మొదలైంది. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు పూర్తయ్యాయి. మూడో మ్యాచ్‌లో ఆరెంజ్‌ ఆర్మీ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ పోటీపడుతున్నాయి. ఈ సందర్భంగా హైదరాబాద్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ ముగ్గురు కూతుళ్లు ఆరెంజ్‌ జెర్సీలు ధరించి ఫొటోకు ఫోజిచ్చారు. ఐపీఎల్‌ నేపథ్యంలో ఈరోజు ఫ్రాంఛైజీలు సామాజిక మాధ్యమాల్లో పంచుకున్న విశేషాలేంటో చూద్దాం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* లైవ్‌ బ్లాగ్‌ కోసం క్లిక్‌ చేయండి

8. రెమిడెసివిర్‌ ఎగుమతులపై నిషేధం

 దేశంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెమిడెసివిర్‌ ఔషధం ఎగుమతులపై నిషేధం విధించింది. ఔషధ నిల్వల వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచాలని.. రెమిడెసివిర్ నల్ల బజారుకు తరలకుండా ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ‘‘ప్రస్తుత పరిస్థితులు చక్కబడే వరకూ రెమ్‌డెసివిర్‌ను ఔషధ తయారీ సంస్థలు ఎగుమతి చేయొద్దు. ఉత్పత్తిదారులు, పంపిణీదారులు రెమ్‌డెసివిర్‌ నిల్వలు దాచొద్దు. ఔషధ నిల్వల వివరాలను ఎప్పటికప్పుడు వెబ్‌సైట్‌ అందుబాటులో ఉంచాలి’’ అని కేంద్రం ప్రకటనలో తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. తిరుమలలో అన్యమత ప్రచారానికి అడ్డుకట్ట వేస్తాం!

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ఆధీనం నుంచి దేవాలయాలను తొలగించటం, తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో మెగా ఇన్వెస్ట్‌మెంట్ టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటుతో పాటు పలు అంశాలతో కూడిన ప్రత్యేక మేనిఫెస్టోను భాజపా-జనసేన కూటమి విడుదల చేసింది. ఆదివారం తిరుపతిలో నిర్వహించిన భాజపా-జనసేన సంయుక్త మీడియా సమావేశంలో లోక్‌సభ ఉపఎన్నిక నేపథ్యంలో ఈ మేనిఫెస్టోను రూపొందించినట్లు ఇరుపార్టీలు ప్రకటించాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. తారక్‌ అభిమానులకు శుభవార్త!

ఎన్టీఆర్‌ అభిమానులకు ఓ శుభవార్త. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా ఓ చిత్రం ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన అప్‌డేట్‌ని ఏప్రిల్ 12న ఇవ్వనున్నట్టు చిత్ర వర్గాలు ప్రకటించాయి. ‘ఎన్టీఆర్‌ 30’ వర్కింగ్‌ టైటిల్‌తో హారికా హాసిని క్రియేషన్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మరి ఆ సర్‌ప్రైజ్‌ ఏంటో తెలియాలంటే కొన్ని గంటలు వేచి చూడాల్సిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ప్రగ్యా నవ్వులు.. మెరిసిన ప్రియాంక..
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని