close

తాజా వార్తలు

పాల్‌కు 281 ఓట్లు

ఈనాడు, అమరావతి: కేఏ పాల్‌....ఆయనో సంచలనం. ఈసారి ఎన్నికల్లో ఆయన చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. సామాజిక మాధ్యమాలైతే ఆయన ప్రచార చిత్రాలతో హోరెత్తాయి. అయితే ఇవేవీ ఆయనకు ఓట్ల వర్షం కురిపించలేదు. ఆయన అధ్యక్షుడిగా ఉన్న ప్రజాశాంతి పార్టీ తరఫున అభ్యర్థులుగా పోటీ చేసిన వారికి రాష్ట్రంలో ఒక్కచోటా డిపాజిట్టు దక్కలేదు, ఎక్కడా కూడా 300కు ఓట్లు మించి పడలేదు. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం అసెంబ్లీ స్థానం నుంచి బరిలో నిలిచిన పాల్‌కు 281 ఓట్లు పడ్డాయి. ఆయన నర్సాపురం లోక్‌సభ స్థానం నుంచి కూడా పోటీ చేశారు.. అక్కడ ఆయనకు 2987 ఓట్లు దక్కాయి.  ప్రజాశాంతి పార్టీ చిహ్నమైన హెలీకాఫ్టర్‌ గుర్తు తమ పార్టీకి చెందిన ఫ్యాన్‌ గుర్తును పోలి ఉందని వైకాపా నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయటంతో పాటు, కొన్ని నియోజకవర్గాల్లో వైకాపా అభ్యర్థుల పేర్లను పోలిన పేర్లు కలిగిన అభ్యర్థులే ప్రజాశాంతి పార్టీ తరఫున బరిలో ఉన్నప్పటికీ... అలాంటి చోట కూడా ప్రజాశాంతి పార్టీకి డిపాజిట్టు రాలేదు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.