పోలీసు శాఖల్లో భారీగా ఖాళీలు: కేంద్రం

తాజా వార్తలు

Published : 30/12/2020 00:02 IST

పోలీసు శాఖల్లో భారీగా ఖాళీలు: కేంద్రం

 

దిల్లీ: దేశంలోని వివిధ రాష్ట్రాల పోలీసు శాఖల్లో దాదాపు 5.31లక్షల ఉద్యోగాల ఖాళీలు ఉన్నట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. అంతేకాకుండా కేంద్ర సాయుధ బలగాల్లో(సీఏపీఎఫ్‌) సుమారు 1.27లక్షల ఖాళీలు ఉన్నట్లు పేర్కొంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ పరిధిలోని పోలీసు పరిశోధన, అభివృద్ధి సంస్థ(బీపీఆర్‌డీ) మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. 

బీపీఆర్‌డీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ‘దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 26.23లక్షల పోలీసు ఉద్యోగాలు మంజూరు చేయగా.. 2020, జనవరి 1 నాటికి ప్రస్తుతం 20.90లక్షల మంది విధుల్లో ఉన్నారు. ఇంకా 5.31లక్షల పోస్టులు ఖాళీలు ఉన్నాయి. కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు 11.9 లక్షల పోస్టులు మంజూరు చేయగా, 2020 జనవరి 1 నాటికి 9.82 లక్షల ఉద్యోగాల భర్తీ చేపట్టారు. ఇంకా 1.27 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాగా 2019లో దేశవ్యాప్తంగా వివిధ పోలీసు శాఖల్లో మొత్తం 1.19లక్షల నియామకాలు జరిగాయి. కాగా దేశవ్యాప్తంగా 2.15లక్షల మంది మహిళా పోలీసులు ఉన్నట్లు బీపీఆర్‌డీ తెలిపింది. 

ఇదీ చదవండి

కొత్త రకంపై కొవాగ్జిన్‌ పనిచేస్తుంది: భారత్‌బయోటెక్‌
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని