
తాజా వార్తలు
విమానంలో ప్రయాణం అనగానేే ఎన్నో సందేహాలు వస్తుంటాయి. విమానం లోనికి అది తీసుకెళ్లొద్దు, ఇది తీసుకెళ్లొద్దు.. అని చెబుతూ ఉంటారు. అయితే ప్రయాణికులు తమ వెంట ఆహార పదార్థాలు తీసుకువెళ్లొచ్చా..? లేదా? చాలా మందికి అనుమానమే! ప్రయాణికులు ఆహార పదార్థాలు తమ వెంట తీసుకెళ్లొచ్చు. కానీ, కొన్ని షరతులు వర్తిస్తాయి. ఘన పదార్థాలు (పండ్లు, సలాడ్స్, చిప్స్) ఎంతైనా తీసుకెళ్లొచ్చు. అయితే ఎక్కువగా తీసుకెళ్తే.. క్యాబిన్ బ్యాగ్ లగేజీ బరువు పెరిగే ప్రమాదం ఉంది. ద్రవపదార్థాలు (కూరలు, సాస్, జ్యూస్) మాత్రం 100 మిల్లీలీటర్లకు మించకూడదు. ఆహార పదార్థాలను పారదర్శకమైన, మళ్లీ సీలు చేయడానికి వీలుగా ఉండే కవర్లో తీసుకెళ్తే.. సెక్యూరిటీ చెక్ఇన్లో ఇబ్బంది ఉండదు.
Tags :