News In Pics: చిత్రం చెప్పే సంగతులు-1(04-04-2023)

Updated : 04 Apr 2023 05:37 IST
1/16
అల్లూరి సీతారామరాజు జిల్లా రాజేంద్రపాలెంలోని ఓ దుకాణం పక్కనే ఉన్న చెత్తలో కొంచెం మిగిలి ఉన్న డ్రింక్‌ బాటిల్‌ ఓ కోతికి సోమవారం దొరికింది. కొద్దిసేపు దాన్ని ఎలా తాగాలా అని అటూ ఇటూ తిప్పుతూ తిరిగింది. చివరకు దానిని కొరికి తాగేసింది. ఈ చిత్రాలను ‘న్యూస్‌టుడే’ క్లిక్‌మనిపించింది. 

2/16
ఇంటివద్దకే బియ్యం పంపిణీ అంటూ వస్తున్న వాహనాలను పలు చోట్ల గృహాలకు దూరంగా ఓ చోట నిలిపేస్తున్నారు. సమీప వాసులు అక్కడికే రావాల్సి వస్తోంది. విశాఖపట్నంలోని వెంకోజిపాలెంలో సోమవారం బియ్యం వాహనం వద్ద  వరసను చిత్రంలో చూడొచ్చు.

3/16
కరీంనగర్‌ జిల్లాలోని ఇల్లందకుంట రైతు వేదికలో పోషణ్‌ పక్వాడాలో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాలు, ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన చిరుధాన్యాల ప్రదర్శన ఆకట్టుకుంది. ఎంపీపీ ఎస్‌.పావని ఎంపీడీవో వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు. 

4/16
 వనపర్తి జిల్లాలోని గోపాల్‌పేట నుంచి చెన్నూకు వెళ్లే దారిలో రోడ్డుకు సమీపంలో ఈ సిలికేశ్వరం చెట్టు ఉంది. దీనికి ఆకులన్నీ రాలిపోగా 10 రోజుల క్రితం(మార్చి 24) ఒక్క ఆకు కూడా కనిపించలేదు. 10 రోజుల తర్వాత (ఏప్రిల్‌ 3) అదే చెట్టు పచ్చని ఆకులతో కళకళలాడుతూ ఆకట్టుకుంటుంది.

5/16
    హైదరాబాద్‌లోని చిలుకూరు బాలాజీ ఆలయ బ్రహ్మోత్సవాలు భక్తుల కోలాహలం మధ్య సాగుతున్నాయి. సోమవారం ఉదయం సూర్యప్రభ, రాత్రికి గరుడ వాహనంపై ఉత్సవమూర్తులను ఊరేగించారు.

6/16
  రోడ్డు పక్కన నడుచుకుంటూ వస్తున్న వీరంతా హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌ సంస్థలో ఒప్పంద ఉద్యోగులు. మూడు షిఫ్టుల్లో కలిపి దాదాపు 12 వేల మంది పనిచేస్తుంటారు. ఐడీఏ చర్లపల్లి నుంచి చక్రీపురం క్రాస్‌ రోడ్డు వరకు ఆటోలు, ఆర్టీసీ బస్సులు లేక రెండు కిలోమీటర్లు నడవాల్సి వస్తోంది. ఈ మార్గంలో కనీసం షిఫ్ట్‌  టైమింగ్‌లోనైనా బస్సులు వేయాలని కోరుతున్నారు. 

7/16
  ఒక్క ఆలోచనతో బాటసారుల దృష్టి ఆకర్షిస్తున్నాడో చిరు వ్యాపారి. పిల్లలు ఆడుకునే బొమ్మపై బండరాయి పెట్టి కొనేవారికి  నాణ్యతపై నమ్మకం కలిగేలా ఇలా ఏర్పాటు చేశాడు. హైదరాబాద్‌లోని బాలాపూర్‌ శివాజీ చౌక్‌ వద్ద రహదారి వెంట విక్రయానికి ఉంచాడు. ఆ మార్గం గుండా ప్రయాణించే వారు ఆశ్చర్యంగా చూస్తున్నారు. బొమ్మ వద్దకు  వచ్చి కొని తీసుకెళ్తున్నారు. 

8/16
  హైదరాబాద్‌ నగర నెహ్రూ జూపార్కులోని జంతువులకు, పక్షులకు వేసవిలో చల్లదనం కల్పించే ఏర్పాట్లను జూ అధికారులు పూర్తి చేశారు. ఈ ఏర్పాట్లను జూన్‌ వరకు కొనసాగిస్తామని జూ క్యూరేటరు ప్రశాంత్‌ బాజీరావుపాటిల్‌ పేర్కొన్నారు. జంతువుల, పక్షుల ఎన్‌క్లోజరుల ముందు నీరు చల్లే సుమారు 200 స్ప్రింక్లర్లు, చిన్న ఎయిర్‌గన్‌లు ఏర్పాటు చేశారు. 

9/16
   హైదరాబాద్‌ నగరంలో ప్రాధాన్య ప్రాంతాలు, ప్రధాన కార్యాలయాల చెంత బారికేడ్లు  ఏర్పాటుచేస్తుంటారు. వివిధ పరిస్థితుల్లో ఆందోళనకారులను అడ్డుకునేందుకు వీటిని ఉపయోగిస్తారు. కొన్నాళ్లుగా సోలార్‌ లైట్లు ఉన్న బారికేడ్లు సైతం వాడుతున్నారు. అలాంటివే రాజ్‌ భవన్‌వద్ద ఏర్పాటుచేశారు.

10/16
   ఎండలు మండుతున్నాయి.. దాహానికి పక్షులు అల్లాడుతున్నాయి.హైదరాబాద్‌ నగర శివారు హయత్‌నగర్‌ మండలం కుంట్లూరు గ్రామ శివారులో తాటి చెట్టుపై ఏర్పాటుచేసిన ముంతపై చిలకలు వాలి తాటి గెలలోనుంచి కారుతున్న కల్లు చుక్కలను తాగుతున్న చిత్రమిది. 

11/16
  పైవంతెన పిల్లర్లు, వయాడక్ట్‌ పనులు పూర్తయినా హైదరాబాద్‌లోని అంబర్‌పేట ఛే నంబర్‌ చౌరస్తా వద్ద రహదారి మరమ్మతుకు నోచుకోవడం లేదు. దీంతో గుంతలతో నిత్యం వాహనదారులు తిప్పలు పడుతున్నారు. ఈ రహదారిపై ప్రయాణిస్తుంటే నడుములు విరుగుతున్నాయని, వాహనాలూ పాడవుతున్నాయని వాపోతున్నారు. 

12/16
 అమెరికాలోని మోంటానా రాష్ట్రం క్లార్క్‌ఫోర్క్‌ నది తీరాన  రైలు పట్టాలు తప్పడంతో  చెల్లాచెదురుగా పడిన బోగీలు

13/16
  దొనెట్్స్క రీజియన్‌లోని పరాస్కోవివ్కాలో రష్యా గిడ్డంగిపై ఉక్రెయిన్‌ దాడి అనంతరం అలుముకున్న పొగ

14/16
 మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌ మండలం ప్రతాప సింగారంలో అయిదేళ్ల కిందట మూడు బ్లాక్‌లలో 164 డబుల్‌బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇళ్ల నిర్మాణం పూర్తయి రెండున్నరేళ్లవుతోంది. అయినా లబ్ధిదారులకు కేటాయించలేదు. ప్రస్తుతం ఈ నిర్మాణాల్లో తలుపులు, కిటికీలు విరిగి, పిచ్చి చెట్లు మొలిచాయి. అసాంఘిక శక్తులకు అడ్డాగా మారాయి.

15/16
   వరంగల్‌ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడలోని ఊర చెరువు నిండు కుండలా ఉండటంతో మూడేళ్లుగా చేపలు పట్టడం లేదు. ఫలితంగా అందులోని చేపలు భారీ సైజులో పెరిగాయి. వాటిని సాధారణ వలలతో పట్టడం సాధ్యం కాలేదు. దాంతో మత్స్యకారులు సోమవారం పెద్దపెద్ద వలలను వాడుతూ పట్టుకున్నారు. చేపలను ఒడ్డుకు తేవడానికి భారీ క్రేన్‌ను ఉపయోగించడం గమనార్హం. తాము 20 టన్నుల వరకు చేపలను పట్టినట్లు వారు తెలిపారు. 

16/16
  తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు సోమవారం కనులపండువగా ప్రారంభమయ్యాయి. ఉదయం శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీమలయప్పస్వామివారు మాడవీధుల్లో ఊరేగింపుగా వసంత మండపానికి వేంచేపు చేశారు. 

మరిన్ని