News In Pics : చిత్రం చెప్పే సంగతులు -2 (17-11-2022)

Updated : 17 Nov 2022 20:08 IST
1/15
చిత్రంలో కనిపిస్తున్న ఫొటో చూసి ఇదేదో ప్రముఖ క్రికెట్‌ గ్రౌండ్‌ అనుకుంటే పొరపాటే. హైదరాబాద్‌ నగర శివారు నాగోల్‌ ఫతుల్లాగూడ వద్ద చిత్రమిది. విపత్తుల నివారణ బృందం ఆధ్వర్యంలో ఇక్కడ అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ మైదానాన్ని ఏర్పాటు చేశారు. మైదానాన్ని అనుకుని ఉన్న కాలనీలో ప్రతి ఇంటిపై సౌరపలకలను ఏర్పాటు చేసుకున్నారు. చిత్రంలో కనిపిస్తున్న ఫొటో చూసి ఇదేదో ప్రముఖ క్రికెట్‌ గ్రౌండ్‌ అనుకుంటే పొరపాటే. హైదరాబాద్‌ నగర శివారు నాగోల్‌ ఫతుల్లాగూడ వద్ద చిత్రమిది. విపత్తుల నివారణ బృందం ఆధ్వర్యంలో ఇక్కడ అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ మైదానాన్ని ఏర్పాటు చేశారు. మైదానాన్ని అనుకుని ఉన్న కాలనీలో ప్రతి ఇంటిపై సౌరపలకలను ఏర్పాటు చేసుకున్నారు.
2/15
గురువారం ఉదయం హుస్సేన్‌సాగర్‌ తీరంలోని బోట్స్ క్లబ్ వద్ద చెట్ల ప్రతిబింబం నీటిలో కనిపించి ఆకట్టుకుంది. గురువారం ఉదయం హుస్సేన్‌సాగర్‌ తీరంలోని బోట్స్ క్లబ్ వద్ద చెట్ల ప్రతిబింబం నీటిలో కనిపించి ఆకట్టుకుంది.
3/15
హైదరాబాద్‌ నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో గురువారం ‘సరస్ ఫెయిర్‌-2022’ ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాకారులు ఇచ్చిన నృత్య ప్రదర్శన చూపరులను ఆకట్టుకుంది. హైదరాబాద్‌ నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో గురువారం ‘సరస్ ఫెయిర్‌-2022’ ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాకారులు ఇచ్చిన నృత్య ప్రదర్శన చూపరులను ఆకట్టుకుంది.
4/15
హైదరాబాద్‌లోని వోల్వో షోరూమ్‌లో ఆ సంస్థ ఎలక్ట్రిక్‌ కారును తొలిసారిగా విక్రయించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ‘ఫెమినా మిస్‌ ఇండియా ఆంధ్రప్రదేశ్‌-22’ సాయిలిఖిత యలమంచిలి, నటి శ్రీలేఖ పాల్గొని ఫొటోలకు పోజులిచ్చారు. హైదరాబాద్‌లోని వోల్వో షోరూమ్‌లో ఆ సంస్థ ఎలక్ట్రిక్‌ కారును తొలిసారిగా విక్రయించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ‘ఫెమినా మిస్‌ ఇండియా ఆంధ్రప్రదేశ్‌-22’ సాయిలిఖిత యలమంచిలి, నటి శ్రీలేఖ పాల్గొని ఫొటోలకు పోజులిచ్చారు.
5/15
ట్రాఫిక్‌ నిబంధనలు కఠినతరం చేయడంతో శిరస్త్రాణం లేనిదే వాహనదారులు రోడ్డుపైకి రావడం లేదు. వాహనదారులంతా శిరస్త్రాణాలు ధరించిన ఈ చిత్రం కూకట్‌పల్లిలో కనిపించింది. ట్రాఫిక్‌ నిబంధనలు కఠినతరం చేయడంతో శిరస్త్రాణం లేనిదే వాహనదారులు రోడ్డుపైకి రావడం లేదు. వాహనదారులంతా శిరస్త్రాణాలు ధరించిన ఈ చిత్రం కూకట్‌పల్లిలో కనిపించింది.
6/15
పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. దర్శనానంతరం ప్రహ్లాద్‌ జోషికి వేదాశీర్వచనం ఇచ్చారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. దర్శనానంతరం ప్రహ్లాద్‌ జోషికి వేదాశీర్వచనం ఇచ్చారు.
7/15
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహించిన రోడ్‌షోకు ప్రజలు భారీగా తరలివచ్చారు. రోడ్‌షో అనంతరం చంద్రబాబు ఎమ్మిగనూరు బయలుదేరారు. అక్కడ రాత్రి 9గంటలకు జరిగే ‘బాదుడే బాదుడు’ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహించిన రోడ్‌షోకు ప్రజలు భారీగా తరలివచ్చారు. రోడ్‌షో అనంతరం చంద్రబాబు ఎమ్మిగనూరు బయలుదేరారు. అక్కడ రాత్రి 9గంటలకు జరిగే ‘బాదుడే బాదుడు’ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు.
8/15
9/15
బోస్నియాలోని సరజెవో నగరంలో కాలుష్యం, పొగమంచు కలిసి ఇలా చీకటి అలముకున్నట్లు కనిపించింది. వాటి మధ్య నుంచి చిన్నగా సూర్యుడి కిరణాలు ప్రసరించాయి. బోస్నియాలోని సరజెవో నగరంలో కాలుష్యం, పొగమంచు కలిసి ఇలా చీకటి అలముకున్నట్లు కనిపించింది. వాటి మధ్య నుంచి చిన్నగా సూర్యుడి కిరణాలు ప్రసరించాయి.
10/15
ఇజ్రాయెల్‌లో పనిచేసే నిజామాబాద్‌ జిల్లా కమ్మర్‌పల్లి వాసి కుమ్మరి దేవరాజుకు వృక్షాలంటే ప్రాణం. వాటి సంరక్షణకు ఏదైనా చేయడానికి ముందుంటాడు. రోడ్డు విస్తరణ, సెంట్రల్‌ లైటింగ్‌ పనుల్లో భాగంగా తొలగిస్తున్న చెట్లను కాపాడటానికి ఏకంగా గురువారం ఇజ్రాయెల్‌ నుంచి స్వగ్రామానికి వచ్చాడు. రూ.2లక్షల వరకు ఖర్చు చేసి 13 చెట్లను జేసీబీ, పొక్లెయిన్ యంత్రాల సహాయంతో వేళ్లతో సహా భద్రంగా బయటకు తీసి స్థానిక బ్రహ్మంగా గుట్ట వద్ద నాటాడు. ఇజ్రాయెల్‌లో పనిచేసే నిజామాబాద్‌ జిల్లా కమ్మర్‌పల్లి వాసి కుమ్మరి దేవరాజుకు వృక్షాలంటే ప్రాణం. వాటి సంరక్షణకు ఏదైనా చేయడానికి ముందుంటాడు. రోడ్డు విస్తరణ, సెంట్రల్‌ లైటింగ్‌ పనుల్లో భాగంగా తొలగిస్తున్న చెట్లను కాపాడటానికి ఏకంగా గురువారం ఇజ్రాయెల్‌ నుంచి స్వగ్రామానికి వచ్చాడు. రూ.2లక్షల వరకు ఖర్చు చేసి 13 చెట్లను జేసీబీ, పొక్లెయిన్ యంత్రాల సహాయంతో వేళ్లతో సహా భద్రంగా బయటకు తీసి స్థానిక బ్రహ్మంగా గుట్ట వద్ద నాటాడు.
11/15
మహారాష్ట్రలో సాగుతున్న భారత్‌ జోడో యాత్రలో సినీనటి రియాసేన్‌ పాల్గొన్నారు. రాహుల్‌ గాంధీతో కలిసి ఆమె పాదయాత్ర చేశారు. మహారాష్ట్రలో సాగుతున్న భారత్‌ జోడో యాత్రలో సినీనటి రియాసేన్‌ పాల్గొన్నారు. రాహుల్‌ గాంధీతో కలిసి ఆమె పాదయాత్ర చేశారు.
12/15
హైదరాబాద్‌ ఎన్టీఆర్ మార్గ్‌లో శని, ఆదివారాల్లో జరగనున్న ఫార్ములావన్ రేసింగ్‌ కోసం వివిధ రాష్ట్రాలు, దేశాలకు చెందిన రేసర్లు కార్లతో హైదరాబాద్‌ చేరుకున్నారు. హైదరాబాద్‌ ఎన్టీఆర్ మార్గ్‌లో శని, ఆదివారాల్లో జరగనున్న ఫార్ములావన్ రేసింగ్‌ కోసం వివిధ రాష్ట్రాలు, దేశాలకు చెందిన రేసర్లు కార్లతో హైదరాబాద్‌ చేరుకున్నారు.
13/15
అమెరికాలో ఉన్న కృష్ణ మనమడు జయకృష్ణ(రమేష్‌ కుమారుడు) తన తాత పార్థివ దేహాన్ని చూసేందుకు బయలుదేరినా.. ఆలస్యం కావడంతో చివరి చూపు దక్కించుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో గురువారం హైదరాబాద్‌లోని కృష్ణ నివాసంలో చిత్రపటానికి నివాళి అర్పించాడు. అమెరికాలో ఉన్న కృష్ణ మనమడు జయకృష్ణ(రమేష్‌ కుమారుడు) తన తాత పార్థివ దేహాన్ని చూసేందుకు బయలుదేరినా.. ఆలస్యం కావడంతో చివరి చూపు దక్కించుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో గురువారం హైదరాబాద్‌లోని కృష్ణ నివాసంలో చిత్రపటానికి నివాళి అర్పించాడు.
14/15
తన జన్మదినం సందర్భంగా మంత్రి రోజా గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో జబర్దస్త్ టీమ్‌తో కలిసి ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. తన జన్మదినం సందర్భంగా మంత్రి రోజా గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో జబర్దస్త్ టీమ్‌తో కలిసి ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు.
15/15
డిప్యూటీ స్పీకర్ కొలగట్ల వీరభద్రస్వామి తిరుమల శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. డిప్యూటీ స్పీకర్ కొలగట్ల వీరభద్రస్వామి తిరుమల శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

మరిన్ని