News In Pics: చిత్రం చెప్పే సంగతులు (03-12-2022)

Updated : 03 Dec 2022 13:39 IST
1/22
కొండ చివరన చిన్న ఆధారంపై కనిపిస్తూ ఆశ్చర్యానికి గురిచేసే ఈ గుండు శ్రీశైలం రహదారిలో వెళ్లేవారికి మామిడిపల్లి వద్ద కనువిందు చేస్తోంది.. కొండ చివరన చిన్న ఆధారంపై కనిపిస్తూ ఆశ్చర్యానికి గురిచేసే ఈ గుండు శ్రీశైలం రహదారిలో వెళ్లేవారికి మామిడిపల్లి వద్ద కనువిందు చేస్తోంది..
2/22
బెంగళూరు నుంచి ఛత్తీస్‌గఢ్‌ తరలిస్తున్న కొత్త ట్రక్‌ ఇది. 18 టైర్ల ట్రాలర్‌ లారీపై 12 టైర్ల ట్రక్‌ను తీసుకెళుతున్న చిత్రం వరంగల్‌ హైవేపై ఘట్‌కేసర్‌ వద్ద శుక్రవారం కనిపించింది. బెంగళూరు నుంచి ఛత్తీస్‌గఢ్‌ తరలిస్తున్న కొత్త ట్రక్‌ ఇది. 18 టైర్ల ట్రాలర్‌ లారీపై 12 టైర్ల ట్రక్‌ను తీసుకెళుతున్న చిత్రం వరంగల్‌ హైవేపై ఘట్‌కేసర్‌ వద్ద శుక్రవారం కనిపించింది.
3/22
వేగంగా దూసుకుపోతున్న ఈ ట్రాలీలో పదిమంది యువకులు నిద్రించడం శుక్రవారం బాలానగర్‌ ప్రధాన రహదారిలో ఐడీపీఎల్‌ ఫ్యాక్టరీ ముందు కనిపించింది. పట్టు తప్పి కింద పడితే ప్రమాదం ఖాయం. వేగంగా దూసుకుపోతున్న ఈ ట్రాలీలో పదిమంది యువకులు నిద్రించడం శుక్రవారం బాలానగర్‌ ప్రధాన రహదారిలో ఐడీపీఎల్‌ ఫ్యాక్టరీ ముందు కనిపించింది. పట్టు తప్పి కింద పడితే ప్రమాదం ఖాయం.
4/22
హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో పాఠశాలలకు వెళ్లే దారిలో ఎలాంటి రక్షణ లేకుండా రోడ్డు దాటడంతో పిల్లలు ప్రమాదాల పాలవుతున్నారు. రాజ్‌ భవన్‌ రోడ్‌లో ఖైరతాబాద్, మక్తాకు వెళ్లడానికి విద్యార్థులు వాహనాల రాకపోకల మధ్యే రోడ్డు దాటుతున్న చిత్రమిది. హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో పాఠశాలలకు వెళ్లే దారిలో ఎలాంటి రక్షణ లేకుండా రోడ్డు దాటడంతో పిల్లలు ప్రమాదాల పాలవుతున్నారు. రాజ్‌ భవన్‌ రోడ్‌లో ఖైరతాబాద్, మక్తాకు వెళ్లడానికి విద్యార్థులు వాహనాల రాకపోకల మధ్యే రోడ్డు దాటుతున్న చిత్రమిది.
5/22
హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ సిబ్బంది చేపడుతున్న కొన్ని చర్యలు వాహనదారులకు ఇబ్బందిగా మారుతున్నాయి. కర్మన్‌ఘాట్‌  ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలను మళ్లించేందుకు దారికి అడ్డంగా విభాగిని దిమ్మెలు ఏర్పాటు చేశారు. అయితే వాటిని ప్రధాన రహదారి మధ్య వరకు పెట్టడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ సిబ్బంది చేపడుతున్న కొన్ని చర్యలు వాహనదారులకు ఇబ్బందిగా మారుతున్నాయి. కర్మన్‌ఘాట్‌ ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలను మళ్లించేందుకు దారికి అడ్డంగా విభాగిని దిమ్మెలు ఏర్పాటు చేశారు. అయితే వాటిని ప్రధాన రహదారి మధ్య వరకు పెట్టడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు.
6/22
అస్సాంలోని కరీంగంజ్‌కు చెందిన నూరుల్‌ హక్‌ అనే మెకానిక్‌ నాలుగు నెలలు కష్టపడి తన వద్ద ఉన్న పాత మారుతీ స్విఫ్ట్‌ను విలాసవంతమైన లంబోర్గిని కారుగా తయారు చేశారు. దీని కోసం రూ.10 లక్షలు ఖర్చు చేశారు. కారును ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మకు బహుమతిగా ఇస్తానని నూరుల్‌ పేర్కొన్నారు. అస్సాంలోని కరీంగంజ్‌కు చెందిన నూరుల్‌ హక్‌ అనే మెకానిక్‌ నాలుగు నెలలు కష్టపడి తన వద్ద ఉన్న పాత మారుతీ స్విఫ్ట్‌ను విలాసవంతమైన లంబోర్గిని కారుగా తయారు చేశారు. దీని కోసం రూ.10 లక్షలు ఖర్చు చేశారు. కారును ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మకు బహుమతిగా ఇస్తానని నూరుల్‌ పేర్కొన్నారు.
7/22
కీసర బస్‌ షెల్టర్‌లో ఇనుప బల్లలు విరిగి పోవడంతో పక్కన పడేశారు. ప్రయాణికులు అమరవీరుల స్తూపం దిమ్మెపై కూర్చుంటున్నారు. వాటిని మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు. కీసర బస్‌ షెల్టర్‌లో ఇనుప బల్లలు విరిగి పోవడంతో పక్కన పడేశారు. ప్రయాణికులు అమరవీరుల స్తూపం దిమ్మెపై కూర్చుంటున్నారు. వాటిని మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు.
8/22
చిలుకానగర్‌ ప్రధాన మార్గంలో రెండు వైపులా ఉన్న పాదబాటలు ఆక్రమణకు గురయ్యాయి. ఉప్పల్‌ నుంచి చిలుకానగర్‌ మీదుగా ఈసీఐఎల్, చర్లపల్లి, మల్లాపూర్‌ పారిశ్రామికవాడలకు వెళ్లేందుకు ప్రధాన మార్గం. నిత్యం ఈ తోవ వాహనాలతోనే నిండిపోతోంది. కాలి బాటల ఆక్రమణతో పాదచారులు నడిచేందుకు వీలు లేకుండా పోయింది. చిలుకానగర్‌ ప్రధాన మార్గంలో రెండు వైపులా ఉన్న పాదబాటలు ఆక్రమణకు గురయ్యాయి. ఉప్పల్‌ నుంచి చిలుకానగర్‌ మీదుగా ఈసీఐఎల్, చర్లపల్లి, మల్లాపూర్‌ పారిశ్రామికవాడలకు వెళ్లేందుకు ప్రధాన మార్గం. నిత్యం ఈ తోవ వాహనాలతోనే నిండిపోతోంది. కాలి బాటల ఆక్రమణతో పాదచారులు నడిచేందుకు వీలు లేకుండా పోయింది.
9/22
మహారాష్ట్రలో సహాజత్వానికి భిన్నంగా ఓ బంగాళదుంప మొక్క దుంపలను కొమ్మలకు కాసి చూపరులను ఆశ్చర్యపరుస్తోంది. పుణె జిల్లాలోని ఆంబెగావా మండలంలోని నిర్గుడ్‌సర్‌ గ్రామంలో సందీప్‌, ధనేశ్‌ పాండురంగ్‌ తమ పొలంలో బంగాళదుంప పంటను వేశారు. అందులోని ఓ మొక్కకు వేళ్లకు కాయాల్సిన దుంపలు కొమ్మకు విరగ కాశాయి. దీంతో ఆ మొక్కను చూసి అవాక్కయ్యారు. మహారాష్ట్రలో సహాజత్వానికి భిన్నంగా ఓ బంగాళదుంప మొక్క దుంపలను కొమ్మలకు కాసి చూపరులను ఆశ్చర్యపరుస్తోంది. పుణె జిల్లాలోని ఆంబెగావా మండలంలోని నిర్గుడ్‌సర్‌ గ్రామంలో సందీప్‌, ధనేశ్‌ పాండురంగ్‌ తమ పొలంలో బంగాళదుంప పంటను వేశారు. అందులోని ఓ మొక్కకు వేళ్లకు కాయాల్సిన దుంపలు కొమ్మకు విరగ కాశాయి. దీంతో ఆ మొక్కను చూసి అవాక్కయ్యారు.
10/22
పచ్చటి మొక్కను వివాహ ఆహ్వాన పత్రికగా మార్చుకున్నారు.. ఓ పర్యావరణ ప్రేమికుడు. దాంతో తన అభిరుచిని చాటుకుంటూ, బంధువులను వేడుకకు ఆహ్వానించారు. అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్‌ నెహ్రూ ఫార్మాసిటీ ఏపీఈపీడీసీఎల్‌ సెక్షన్‌ కార్యాలయ పరిధిలో అసిస్టెంట్‌ లైన్‌మెన్‌ దుర్గాప్రసాద్‌ వివాహం నేడు. ప్రకృతిపై తనకున్న ప్రేమను నలుగురికీ తెలియజేసేలా.. చిట్టి మందార మొక్కలకు ట్యాగ్‌ తరహాలో ఆహ్వాన పత్రికను కట్టి పంపిణీ చేశారు. పచ్చటి మొక్కను వివాహ ఆహ్వాన పత్రికగా మార్చుకున్నారు.. ఓ పర్యావరణ ప్రేమికుడు. దాంతో తన అభిరుచిని చాటుకుంటూ, బంధువులను వేడుకకు ఆహ్వానించారు. అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్‌ నెహ్రూ ఫార్మాసిటీ ఏపీఈపీడీసీఎల్‌ సెక్షన్‌ కార్యాలయ పరిధిలో అసిస్టెంట్‌ లైన్‌మెన్‌ దుర్గాప్రసాద్‌ వివాహం నేడు. ప్రకృతిపై తనకున్న ప్రేమను నలుగురికీ తెలియజేసేలా.. చిట్టి మందార మొక్కలకు ట్యాగ్‌ తరహాలో ఆహ్వాన పత్రికను కట్టి పంపిణీ చేశారు.
11/22
డ్రైవింగ్‌ చేస్తున్నప్పుడు చరవాణిలో చాటింగ్‌ చేయవద్దని అవగాహన కల్పిస్తూ జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు సిగ్నల్‌ వద్ద శుక్రవారం యువకులు ఇలా ప్లకార్డులు ప్రదర్శించారు. డ్రైవింగ్‌ చేస్తున్నప్పుడు చరవాణిలో చాటింగ్‌ చేయవద్దని అవగాహన కల్పిస్తూ జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు సిగ్నల్‌ వద్ద శుక్రవారం యువకులు ఇలా ప్లకార్డులు ప్రదర్శించారు.
12/22
 పోలీసు ఉద్యోగాలకు యువతీ, యువకులు అధిక సంఖ్యలో సన్నద్ధమవుతున్నారు. ఈ నెల 8 నుంచి దేహదారుఢ్య పరీక్షలు ప్రారంభం కానుండడంతో ఉద్యోగార్థులు మరింత పట్టుదలతో పరుగు, లాంగ్‌జంప్‌, షాట్పుట్ తదితర ఈవెంట్లలో సాధన కొనసాగిస్తున్నారు. శుక్రవారం మహబూబాబాద్‌ ఎన్టీఆర్‌ మినీ స్టేడియంలో పోలీసు ఉద్యోగార్థులు సాధన చేస్తున్న దృశ్యాలివి.. పోలీసు ఉద్యోగాలకు యువతీ, యువకులు అధిక సంఖ్యలో సన్నద్ధమవుతున్నారు. ఈ నెల 8 నుంచి దేహదారుఢ్య పరీక్షలు ప్రారంభం కానుండడంతో ఉద్యోగార్థులు మరింత పట్టుదలతో పరుగు, లాంగ్‌జంప్‌, షాట్పుట్ తదితర ఈవెంట్లలో సాధన కొనసాగిస్తున్నారు. శుక్రవారం మహబూబాబాద్‌ ఎన్టీఆర్‌ మినీ స్టేడియంలో పోలీసు ఉద్యోగార్థులు సాధన చేస్తున్న దృశ్యాలివి..
13/22
దర్శకుడు గుణశేఖర్‌ కుమార్తె నీలిమ గుణ, వ్యాపారవేత్త రవి ప్రక్యాల వివాహం శుక్రవారం ఫలక్‌నుమా ప్యాలెస్‌లో వైభవంగా జరిగింది. ప్రముఖ సినీ నటుడు చిరంజీవి దంపతులు, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై నూతన జంటను ఆశీర్వదించారు. దర్శకుడు గుణశేఖర్‌ కుమార్తె నీలిమ గుణ, వ్యాపారవేత్త రవి ప్రక్యాల వివాహం శుక్రవారం ఫలక్‌నుమా ప్యాలెస్‌లో వైభవంగా జరిగింది. ప్రముఖ సినీ నటుడు చిరంజీవి దంపతులు, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై నూతన జంటను ఆశీర్వదించారు.
14/22
సోమాజిగూడలోని విల్లామేరీ మహిళా కళాశాలలో ‘ద విల్లా కాంక్లేవ్‌ 2కే22’ శుక్రవారం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు కొనసాగే ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర విద్యా, మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ రావుల శ్రీధర్‌రెడ్డి ప్రారంభించారు. నగరంలోని పలు కళాశాలల విద్యార్థులకు జామ్‌-టాకథాన్‌, వీధి నాటకం, ఓపెన్‌ మైక్‌, ఫ్యాన్సీ డ్రెస్‌ పోటీలు తదితర అంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. సోమాజిగూడలోని విల్లామేరీ మహిళా కళాశాలలో ‘ద విల్లా కాంక్లేవ్‌ 2కే22’ శుక్రవారం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు కొనసాగే ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర విద్యా, మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ రావుల శ్రీధర్‌రెడ్డి ప్రారంభించారు. నగరంలోని పలు కళాశాలల విద్యార్థులకు జామ్‌-టాకథాన్‌, వీధి నాటకం, ఓపెన్‌ మైక్‌, ఫ్యాన్సీ డ్రెస్‌ పోటీలు తదితర అంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు.
15/22
కేపీహెచ్‌బీలో మేయర్‌ విజయలక్ష్మితో కలిసి షటిల్‌ ఆడుతున్న మంత్రి కేటీఆర్‌ కేపీహెచ్‌బీలో మేయర్‌ విజయలక్ష్మితో కలిసి షటిల్‌ ఆడుతున్న మంత్రి కేటీఆర్‌
16/22
విశాఖ సాగర తీరంలో శుక్రవారం నిర్వహించిన నౌకాదళ విన్యాసాల్లో గగనతలాన మిగ్‌ మెరుపులు విశాఖ సాగర తీరంలో శుక్రవారం నిర్వహించిన నౌకాదళ విన్యాసాల్లో గగనతలాన మిగ్‌ మెరుపులు
17/22
సాగర తీరంలో శుక్రవారం నిర్వహించిన నౌకాదళ విన్యాసాలు తూర్పు నౌకాదళం సత్తాను చాటాయి. అందులో భాగంగానే చేపట్టిన అద్భుత విస్పోటం ఇది. సాగర తీరంలో శుక్రవారం నిర్వహించిన నౌకాదళ విన్యాసాలు తూర్పు నౌకాదళం సత్తాను చాటాయి. అందులో భాగంగానే చేపట్టిన అద్భుత విస్పోటం ఇది.
18/22
విజయనగరం యువత కేరింతలతో సందడి చేసింది. సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌ ప్రారంభోత్సవానికి రాశీఖన్నా, పాయల్‌ రాజ్‌పూత్‌, సీఎంఆర్‌ షాపింగ్‌ మాల్‌ పునః ప్రారంభోత్సవానికి అనూ ఇమ్మాన్యుయేల్‌ హాజరయ్యారు. ఈ ముగ్గురు కథానాయికలను చూసేందుకు భారీగా జనం తరలివచ్చి వారితో స్వీయ చిత్రాలు తీసుకోవడానికి పోటీ పడ్డారు. విజయనగరం యువత కేరింతలతో సందడి చేసింది. సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌ ప్రారంభోత్సవానికి రాశీఖన్నా, పాయల్‌ రాజ్‌పూత్‌, సీఎంఆర్‌ షాపింగ్‌ మాల్‌ పునః ప్రారంభోత్సవానికి అనూ ఇమ్మాన్యుయేల్‌ హాజరయ్యారు. ఈ ముగ్గురు కథానాయికలను చూసేందుకు భారీగా జనం తరలివచ్చి వారితో స్వీయ చిత్రాలు తీసుకోవడానికి పోటీ పడ్డారు.
19/22
నెల్లూరులో శుక్రవారం సినీ, బుల్లితెర తారలు సందడి చేశారు. వారిని తిలకించేందుకు వచ్చిన అభిమానులతో ఆ ప్రాంతంలో కిక్కిరిసిపోయంది. ఈ సందర్భంగా కథానాయిక కృతిశెట్టి ఇలా వారిని అలరించారు. నెల్లూరులో శుక్రవారం సినీ, బుల్లితెర తారలు సందడి చేశారు. వారిని తిలకించేందుకు వచ్చిన అభిమానులతో ఆ ప్రాంతంలో కిక్కిరిసిపోయంది. ఈ సందర్భంగా కథానాయిక కృతిశెట్టి ఇలా వారిని అలరించారు.
20/22
గుంటూరు జిల్లా వేమూరులో ద్విచక్రవాహనం వెనక బ్యాలెన్స్‌గా నిలబడి ప్రయాణం చేస్తున్న శునకం చూపరులను అకట్టుకుంది. గుంటూరు జిల్లా వేమూరులో ద్విచక్రవాహనం వెనక బ్యాలెన్స్‌గా నిలబడి ప్రయాణం చేస్తున్న శునకం చూపరులను అకట్టుకుంది.
21/22
బాపట్లలోని ఏజీ కళాశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి యువజనోత్సవాల్లో యువత శాస్రీయ, జానపద నృత్యాలు, వాయిద్య పరికరాలు, జానపద గేయాలు, ఏకపాత్రాభినయం, వక్తృత్వం పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. బాపట్లలోని ఏజీ కళాశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి యువజనోత్సవాల్లో యువత శాస్రీయ, జానపద నృత్యాలు, వాయిద్య పరికరాలు, జానపద గేయాలు, ఏకపాత్రాభినయం, వక్తృత్వం పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
22/22
బాపట్ల జిల్లా కొరిశపాడు మండలంలోని మేదరమెట్ల నుంచి రావినూతల వరకు వెళ్లే రోడ్డులో గుంతలు ఎక్కువగా ఉండడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆటో చోదకులూ ఇబ్బందులు పడుతున్నారు. ఈ గుంతల్లో పడి ఆటోలు దెబ్బతింటున్నాయి. వారికి వచ్చే ఆదాయం ఎక్కువగా వీటి మరమ్మతులకే ఖర్చు చేయాల్సి వస్తోంది. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎటువంటి ప్రయోజనం కలగలేదు. దీంతో రావినూతల ఆటో సంఘం అధ్యక్షుడు కొలకలూరి చిన్న ఆధ్వర్యంలో ఆటో చోదకులు చేతులు కలిపి రోడ్డుపై పడిన గుంతలను మట్టితో పూడ్చివేశారు. బాపట్ల జిల్లా కొరిశపాడు మండలంలోని మేదరమెట్ల నుంచి రావినూతల వరకు వెళ్లే రోడ్డులో గుంతలు ఎక్కువగా ఉండడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆటో చోదకులూ ఇబ్బందులు పడుతున్నారు. ఈ గుంతల్లో పడి ఆటోలు దెబ్బతింటున్నాయి. వారికి వచ్చే ఆదాయం ఎక్కువగా వీటి మరమ్మతులకే ఖర్చు చేయాల్సి వస్తోంది. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎటువంటి ప్రయోజనం కలగలేదు. దీంతో రావినూతల ఆటో సంఘం అధ్యక్షుడు కొలకలూరి చిన్న ఆధ్వర్యంలో ఆటో చోదకులు చేతులు కలిపి రోడ్డుపై పడిన గుంతలను మట్టితో పూడ్చివేశారు.

మరిన్ని