News In Pics: చిత్రం చెప్పే సంగతులు 01 (25-05-2023)

Updated : 25 May 2023 12:32 IST
1/20
అనకాపల్లి జిల్లా తిమ్మరాజుపేటలో బ్రహ్మ కమలాలు వికసించాయి. ఈ గ్రామానికి చెందిన కోరిబిల్లి హరీష్‌ ఇంటి వద్ద ఈ అరుదైన  కమలాలు బుధవారం పూశాయి. వీటిని ఆయుర్వేద వైద్యంలోనూ వినియోగిస్తారు. అనకాపల్లి జిల్లా తిమ్మరాజుపేటలో బ్రహ్మ కమలాలు వికసించాయి. ఈ గ్రామానికి చెందిన కోరిబిల్లి హరీష్‌ ఇంటి వద్ద ఈ అరుదైన కమలాలు బుధవారం పూశాయి. వీటిని ఆయుర్వేద వైద్యంలోనూ వినియోగిస్తారు.
2/20
రెండు బండ్లను ఒకే డ్రైవర్‌ ఎలా నడుపుతారా అని ఆలోచిస్తున్నారా.. ఈ చిత్రం చూస్తే ఔరా అనక మానరు. ఓ చిరు వ్యాపారి తన ద్విచక్ర వాహనానికి  నాలుగు చక్రాలతోపుడు బండిని కట్టుకొని వరంగల్‌-ఖమ్మం ప్రధాన రహదారిలో వెళుతూ కనిపించారు. దారి వెంట వెళ్లేవారు వింతగా చూశారు. రెండు బండ్లను ఒకే డ్రైవర్‌ ఎలా నడుపుతారా అని ఆలోచిస్తున్నారా.. ఈ చిత్రం చూస్తే ఔరా అనక మానరు. ఓ చిరు వ్యాపారి తన ద్విచక్ర వాహనానికి నాలుగు చక్రాలతోపుడు బండిని కట్టుకొని వరంగల్‌-ఖమ్మం ప్రధాన రహదారిలో వెళుతూ కనిపించారు. దారి వెంట వెళ్లేవారు వింతగా చూశారు.
3/20
మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సెంట్రల్‌ లైటింగ్‌ వెలుగులు విరజిమ్ముతున్నాయి. స్థానిక  సీఈఆర్‌ క్లబ్‌ నుంచి పోస్టాఫీస్‌ వరకు మొదటి విడతగా చేపట్టిన పనులు దాదాపు పూర్తి చేశారు. ఈ క్రమంలో బుధవారం లైటింగ్‌ ట్రయల్‌రన్‌ నిర్వహిస్తున్నారు. దీంతో కోల్‌బెల్ట్‌ రహదారి వెలుగుల మధ్య ప్రత్యేక ఆకర్షణ సంతరిచుకుంది. మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సెంట్రల్‌ లైటింగ్‌ వెలుగులు విరజిమ్ముతున్నాయి. స్థానిక సీఈఆర్‌ క్లబ్‌ నుంచి పోస్టాఫీస్‌ వరకు మొదటి విడతగా చేపట్టిన పనులు దాదాపు పూర్తి చేశారు. ఈ క్రమంలో బుధవారం లైటింగ్‌ ట్రయల్‌రన్‌ నిర్వహిస్తున్నారు. దీంతో కోల్‌బెల్ట్‌ రహదారి వెలుగుల మధ్య ప్రత్యేక ఆకర్షణ సంతరిచుకుంది.
4/20
ఈ చిత్రంలో కనిపిస్తున్న విద్యుత్ స్తంభం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని రాంనగర్‌కు వెళ్లేదారిలో కల్వర్టు దగ్గర ఉంది. దీనికి నిలువెత్తుగా చుట్టూ చెట్లు పెరిగాయి.  పచ్చని తీగజాతికి చెందిన చెట్టుపై వరకు ఎగబాకి మొత్తం విద్యుత్‌ సరఫరా అయ్యే తీగలను అల్లుకుంది. తరుచూ కురుస్తున్న వర్షాలకు తడితో విద్యుత్‌ సరఫరా కిందివరకు జరిగే ప్రమాదం ఉంది. ఈ చిత్రంలో కనిపిస్తున్న విద్యుత్ స్తంభం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని రాంనగర్‌కు వెళ్లేదారిలో కల్వర్టు దగ్గర ఉంది. దీనికి నిలువెత్తుగా చుట్టూ చెట్లు పెరిగాయి. పచ్చని తీగజాతికి చెందిన చెట్టుపై వరకు ఎగబాకి మొత్తం విద్యుత్‌ సరఫరా అయ్యే తీగలను అల్లుకుంది. తరుచూ కురుస్తున్న వర్షాలకు తడితో విద్యుత్‌ సరఫరా కిందివరకు జరిగే ప్రమాదం ఉంది.
5/20
 మహబూబాబాద్‌లోని  దంతాలపల్లి అంబేడ్కర్‌ కూడలిలో ఓ ట్రాలీ ఆటోలో కోడిగుడ్లను తీసుకొచ్చి దుకాణాలకు సరఫరా చేస్తుండగా, అక్కడే ఉన్న ఓ కోతి రెండు గుడ్లను తీసుకొని పరుగుతీసింది. ఒక గుడ్డును కాళ్ల కింద దాచుకొని మరొక గుడ్డును తినేందుకు ప్రయత్నించింది.  చాలసేపటి వరకు గుడ్డు పగలకపోవడంతో అది పలు ప్రయత్నాలు చేసింది. మహబూబాబాద్‌లోని దంతాలపల్లి అంబేడ్కర్‌ కూడలిలో ఓ ట్రాలీ ఆటోలో కోడిగుడ్లను తీసుకొచ్చి దుకాణాలకు సరఫరా చేస్తుండగా, అక్కడే ఉన్న ఓ కోతి రెండు గుడ్లను తీసుకొని పరుగుతీసింది. ఒక గుడ్డును కాళ్ల కింద దాచుకొని మరొక గుడ్డును తినేందుకు ప్రయత్నించింది. చాలసేపటి వరకు గుడ్డు పగలకపోవడంతో అది పలు ప్రయత్నాలు చేసింది.
6/20
చూట్టూ పచ్చని పొలాలు.. అప్పుడప్పుడూ సూర్యుడిని కమ్ముకున్న మబ్బులతో వాతావరణం చల్లగా ఆహ్లాదకరంగా మారింది. పరవశించిన మయూరం పురివిప్పింది. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ నియోజకవర్గం ఫరూఖ్‌నగర్‌ మండలం అన్నారం గ్రామ శివారులోని ఓ వ్యవసాయ పొలం వద్ద బుధవారం ఈ దృశ్యం కనిపించింది. చూట్టూ పచ్చని పొలాలు.. అప్పుడప్పుడూ సూర్యుడిని కమ్ముకున్న మబ్బులతో వాతావరణం చల్లగా ఆహ్లాదకరంగా మారింది. పరవశించిన మయూరం పురివిప్పింది. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ నియోజకవర్గం ఫరూఖ్‌నగర్‌ మండలం అన్నారం గ్రామ శివారులోని ఓ వ్యవసాయ పొలం వద్ద బుధవారం ఈ దృశ్యం కనిపించింది.
7/20
  రిక్షా బండిపై నీళ్ల బిందెలను తీసుకెళ్తున్న ఈ దృశ్యం ప్రకాశం జిల్లా నడికూడలైన పొదిలిలోనిది. ఇక్కడ శాశ్వత తాగునీటి వనరులు లేకపోయాయి. ఈ ప్రాంతం పట్టణానికి సుమారు అయిదు కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. అయినప్పటికీ పట్టణ వాసులు రిక్షాలు, ఆటోలపై అక్కడికి వెళ్లి బిందెలు నింపుకొని నీళ్లు తెచ్చుకుంటూ తమ అవసరాలు తీర్చుకుంటుంటారు.  

8/20
 హనుమకొండ బాలసముద్రంలోని స్విమ్మింగ్‌ పూల్‌తో పాటు ప్రైవేట్‌ ఈత కొలనులు నగరంలో అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో చిన్నారులు, పెద్దలు సభ్యత్వం తీసుకుంటున్నారు. వేసవితాపం నుంచి ఉపశమనం పొందడానికి ఉదయం, సాయంత్రం ఈత కొలనుల్లో జలకాటలు ఆడుతున్నారు.

9/20
హనుమకొండ జిల్లాలోని శ్రీభద్రకాళి దేవాలయం మాడవీధుల సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌) రూ.30 కోట్లతో సిద్ధమైంది. మాడవీధుల నిర్మాణ దస్త్రం రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఈఎన్‌సీˆ వద్దకెళ్లింది. సాంకేతిక అనుమతులు రాగానే టెండర్లు పిలిచేందుకు కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా) అధికారులు అన్ని సిద్ధం చేస్తున్నారు.

10/20
 నాగర్‌కర్నూల్‌ జిల్లా పెంట్లవెల్లి మండలం జటప్రోలు కత్వా వేసవిలోనూ కనువిందు చేస్తోంది. శ్రీశైలం జలాశయం తిరుగు జలాల్లో మునిగి ఉంటుంది. జలాశయంలో నీటిమట్టం తగ్గితేనే ఇది బయట పడుతుంది.

నాగర్‌కర్నూల్‌ జిల్లా పెంట్లవెల్లి మండలం జటప్రోలు కత్వా వేసవిలోనూ కనువిందు చేస్తోంది. శ్రీశైలం జలాశయం తిరుగు జలాల్లో మునిగి ఉంటుంది. జలాశయంలో నీటిమట్టం తగ్గితేనే ఇది బయట పడుతుంది.
11/20
 నిర్మల్‌ పట్టణంలోని బైల్‌బజార్‌లో  ఓ వ్యాపారి దర్జాగా రహదారిపైనే తన దందాను కొనసాగిస్తున్నాడు. కొనుగోలుచేసిన ధాన్యం రోడ్డుపై పోసి కూలీలతో సంచుల్లో నింపిస్తున్నాడు. దీనికితోడు ధాన్యం విక్రయించేందుకు వచ్చిన వాహనాలు అక్కడే నిలపడటంతో అక్కడంతా ఇరుకుగా మారింది. నిర్మల్‌ పట్టణంలోని బైల్‌బజార్‌లో ఓ వ్యాపారి దర్జాగా రహదారిపైనే తన దందాను కొనసాగిస్తున్నాడు. కొనుగోలుచేసిన ధాన్యం రోడ్డుపై పోసి కూలీలతో సంచుల్లో నింపిస్తున్నాడు. దీనికితోడు ధాన్యం విక్రయించేందుకు వచ్చిన వాహనాలు అక్కడే నిలపడటంతో అక్కడంతా ఇరుకుగా మారింది.
12/20
 హైదరాబాద్‌లోని పెద్దఅంబర్‌పేట వద్ద వర్డ్‌ అండ్‌ డీడ్‌ పాఠశాల సమీపంలో నిలువెల్లా విరబూసిన ఎర్రతురాయి చెట్టు కనువిందు చేస్తోంది. విస్తరణలో భాగంగా ఇటీవల రోడ్డు పొడవునా ఉన్న చెట్లు తరలించారు. కొన్నింటిని తొలగించారు. రోడ్డు నుంచి కాస్త లోపలికి ఉండటంతో ఈ చెట్టు ఇలా స్థిరంగా నేత్రపర్వంగా నిలిచింది.  

13/20
 జూన్‌ 2 నుంచి తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు నిర్వహించనున్న సందర్భంగా  హైదరాబాద్‌లోని నూతన సచివాలయం బుధవారం మువ్వన్నెల విద్యుత్తు వెలుగుల్లో తళుకులీనింది. 

జూన్‌ 2 నుంచి తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు నిర్వహించనున్న సందర్భంగా హైదరాబాద్‌లోని నూతన సచివాలయం బుధవారం మువ్వన్నెల విద్యుత్తు వెలుగుల్లో తళుకులీనింది.
14/20
సినీముద్దుగుమ్మలు శాన్వీమేఘన, శృతికరాయ్‌ బుధవారం  హైదరాబాద్‌లోని మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో సందడి చేశారు. హై లైఫ్‌ పేరిట ఇక్కడ ఏర్పాటు చేసిన వస్త్రాభరణాల ప్రదర్శనకు వారు ముఖ్యఅతిథులుగా విచ్చేసి ప్రారంభించారు.

15/20
  ప్రమాదమని తెలిసినా ఎటువంటి జాగ్రత్తలు, శిరస్త్రాణం లేకుండా  హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇందిరానగర్‌ వద్ద ప్రధాన రహదారిపై ఓ ద్విచక్రవాహనంపై ఐదుగురు ప్రయాణించారు. ఇలాంటి ప్రయాణం వారికే కాకుండా ఇతర ప్రయాణికులకు ప్రమాదకరమే కదా!

16/20
 హైదరాబాద్‌లోని దుండిగల్‌ పురపాలిక బహదూర్‌పల్లి చౌరస్తాలో ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణకు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యారు. దాదాపు గంటపాటు కరెంటు లేక ఫ్యాన్లు పనిచేయకపోవడంతో ఆయన వ్యక్తిగత సిబ్బంది ఇలా చిన్న బ్యాటరీ ఫ్యాన్‌ను వినియోగించారు

17/20
ఇది హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌ ప్రధాన రహదారి. తారు రోడ్డు వేసి 6 నెలలైంది. చైతన్యపురి వద్ద మురుగు మ్యాన్‌హోల్‌ ధ్వంసమై నెల రోజులైంది. గుంత పడి కొత్తగా వేసిన రోడ్డు సైతం కుంగింది. వాహనదారులకు ఇబ్బంది కలగకుండా ఇన్నాళ్లు బారికేడ్‌ పెట్టి వదిలేశారు. 

18/20
హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌ స్టేడియంలో నిర్వహిస్తున్న వేసవి శిబిరంలో స్కేటింగ్‌లో శిక్షణ పొందుతున్న చిన్నారులు

హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌ స్టేడియంలో నిర్వహిస్తున్న వేసవి శిబిరంలో స్కేటింగ్‌లో శిక్షణ పొందుతున్న చిన్నారులు
19/20
శ్రీనగర్‌లో జరిగిన జీ-20 సదస్సుకు విచ్చేసిన విదేశీ ప్రతినిధులు స్థానిక సంప్రదాయ దుస్తుల్లో ఇలా ఫొటోలు దిగారు

శ్రీనగర్‌లో జరిగిన జీ-20 సదస్సుకు విచ్చేసిన విదేశీ ప్రతినిధులు స్థానిక సంప్రదాయ దుస్తుల్లో ఇలా ఫొటోలు దిగారు
20/20
భారత త్రివర్ణ పతాకం వెలుగులతో అలంకరించిన సిడ్నీలోని ఒపేరా హౌస్‌ ఎదుట భారత్, ఆస్ట్రేలియా ప్రధానులు మోదీ, ఆంథోనీ ఆల్బనీస్‌

భారత త్రివర్ణ పతాకం వెలుగులతో అలంకరించిన సిడ్నీలోని ఒపేరా హౌస్‌ ఎదుట భారత్, ఆస్ట్రేలియా ప్రధానులు మోదీ, ఆంథోనీ ఆల్బనీస్‌

మరిన్ని