News in Pics : చిత్రం చెప్పే సంగతులు(18-03-2024)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Updated : 18 Mar 2024 05:13 IST
1/12
హైదరాబాద్‌: ఆదివారం ఉదయం సాగర తీరంలో వేలాది మంది మహిళలు చీరకట్టులో మెరిశారు. పీపుల్స్‌ ప్లాజాలో నిర్వహించిన తనైరా శారీ రన్‌కు పెద్దఎత్తున అతివలు తరలివచ్చారు. సంప్రదాయ చీరల్లో ముస్తాబై ఉత్సాహంగా పరుగుతీశారు. హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

2/12
హైదరాబాద్‌: భూగర్భ జలాలు అడుగంటుతుండడంతో నీటి పొదుపు చర్యలు పాటించాలని, లేనిపక్షంలో బెంగళూరు దుస్థితే తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈనేపథ్యంలో ఖైరతాబాద్‌ జలమండలి కార్యాలయం వద్ద వేస్తున్న ఈ చిత్రం నీటి పొదుపు ఆవశ్యకతకు అద్దంపడుతోంది.

3/12
నిజామాబాద్‌ నగరంలోని ఓ ఇంటి ముందు ఖాళీ స్థలం లేక పోవడంతో బంగ్లాపైనే పచ్చని గడ్డితో పరిచి అందమైన లాన్‌ ఏర్పాటు చేశారు. వివిధ రకాల పూలమొక్కలతో అందంగా అలంకరించడంతో ఆహ్లాదం సంతరించుకుంది.

4/12
ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రానికి చెందిన 42 మంది యోగా సాధకులు పాల్గొన్నారు. జిల్లా యోగాసన స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి చేతన్‌ నేతృత్వంలో ఆదివారం సాయంత్రం వారు ధ్యాన కేంద్రం ఆవరణలో యోగాసనాలు వేసి అందరిని అబ్బురపరిచారు.

5/12
చిత్తూరు: శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ఈ నెల 20 నుంచి 24 వరకు జరగనున్న నేపథ్యంలో పుష్కరిణిలో తెప్ప నిర్మాణం పూర్తయింది.  తితిదే ఇంజినీరింగ్‌  సిబ్బంది తెప్ప నిర్మాణం పూర్తి చేశారు. ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు తితిదే ఏర్పాట్లు చేస్తోందని ఈవో ఏవీ ధర్మారెడ్డి ఇప్పటికే తెలిపారు.

6/12
గుంటూరు: మంగళగిరి మండలం ఆత్మకూరు సమీపంలోని సీకే కన్వెన్షన్‌లో హీరో దగ్గుబాటి వెంకటేష్‌, నీరజ దంపతుల  కుమార్తె వివాహ రిసెప్షన్‌ ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. చిత్రంలో పెళ్లి కుమార్తె హవ్యవాహిని, పెళ్లి కుమారుడు నిషాంత్‌, కుటుంబ సభ్యులు.

7/12
కరీంనగర్‌:  చొప్పదండిలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు బోనాలను అందంగా అలంకరించి డప్పు చప్పుళ్ల మధ్య అమ్మవారికి సమర్పించారు. నాలుగు రోజులపాటు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు గౌడ సంఘం అధ్యక్షుడు పెరుమాండ్ల గంగయ్య తెలిపారు.

8/12
వరంగల్‌: రహదారిపై రాకపోకలు సాగిస్తున్న ప్రయాణికుల దృష్టి పంటపై పడకుండా ఉండేందుకు ఓ రైతు వినూత్నంగా ఆలోచించారు. మిర్చి పంటలో ఓ దిష్టిబొమ్మకు శిరస్త్రాణం(హెల్మెట్), కళ్ల జోడు పెట్టి ఆకర్షించేలా చేశారు.టేకుమట్ల మండలం వెల్లంపల్లి నుంచి ఎంపేడుకు వెళ్లే ప్రధాన రహదారికి పక్కనే మిర్చి పంటలో ఈ దృశ్యం కనిపించింది.

9/12
మెదక్‌: సిద్దిపేట గ్రామీణ మండలం బండచర్లపల్లి వాసి పోతరాజు యాదగిరి మాత్రం సైకిల్‌పై ప్రయాణిస్తూ సురక్షితంగా ఉండేందుకు శిరస్త్రాణం ధరిస్తుంటారు. రోజూ 20 కి.మీ. దూరాన్ని సైకిల్‌పై ఇలా తిరుగుతానని ఆయన తెలిపారు.

10/12
మహబూబ్‌నగర్‌:  వేసవి కాలం ఇంకా పూర్తి స్థాయిలో రాక ముందే తుంగభద్ర నది దాదాపుగా ఎండిపోయింది. ఇప్పుడే ఇలా ఉంటే ఏప్రిల్‌, మే నెలల్లో ప్రస్తుతం అక్కడక్కడా కన్పిస్తున్న నీరు కూడా కనిపించని పరిస్థితి ఏర్పడనుందని ప్రజలంటున్నారు.

11/12
తమిళనాడు: రష్యా అధ్యక్ష ఎన్నికల కోసం నగరంలోని రష్యా సైన్స్‌, కల్చరల్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూత్‌లో ఆదివారం రష్యన్‌ కాన్సుల్‌ జనరల్‌ ఒలెగ్‌ అవ్‌దీవ్‌ పరిశీలించారు. రష్యా పౌరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

12/12
మెదక్‌: సిద్దిపేట పట్టణంలోని బ్లాక్‌ ఆఫీస్‌ వద్ద ఓ హోటల్‌ నిర్వాహకులు వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రత్యేకంగా బొమ్మ తయారు చేయించి ప్రదర్శనగా పెట్టారు. బొమ్మను చూడగానే అది చాయ్‌ హోటల్‌ అని తెలిసేలా రూపొందించారు. అందరినీ ఆకట్టుకుంటోంది.

Tags :

మరిన్ని