News in Pics : చిత్రం చెప్పే సంగతులు(21-03-2024)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Updated : 21 Mar 2024 04:31 IST
1/14
హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌లో  సినీనటి రీతూవర్మ బుధవారం సందడి చేశారు. ఓ ఆభరణాల దుకాణం ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. అభిమానులతో ముచ్చటించి అలరించారు.

2/14
కర్ణాటక: భారతీయ వాయుసేన శిక్షణ కేంద్రంలో నెల పాటు నిర్వహించిన మహిళా దినోత్సవ కార్యక్రమాలకు బుధవారం తెరపడింది.వివిధ పోటీల్లో ఉత్తమ ప్రదర్శన చూపిన మహిళలకు ప్రశంస పత్రాలు, బహుమతులు అందజేశారు. శారీరక, మానసిక దృఢత్వం కోసం తాము ఈ పోటీలను నిర్వహించామని గుల్‌ పనాంగ్‌ తెలిపారు.

3/14
విశాఖపట్నం: భారత్‌- అమెరికా దేశాలు సంయుక్తగా విశాఖలో నిర్వహిస్తున్న టైగర్‌ ట్రయంఫ్‌-24 విన్యాసాల్లో పాల్గొనేందుకు బుధవారం నగరానికి చేరిన అమెరికా యుద్ధవిమానాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

4/14
కర్ణాటక పర్యాటక శాఖ సహకారంతో నిర్వహించిన కార్యక్రమంలో నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఔత్సాహికులు పాల్గొన్నారు. ప్రసన్న సైకియా, నందితా మొండల్, బ్రాండీ లీరే తదితరులు గంటకుపైగా పాటు, సృజనాత్మక నృత్యంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

5/14
హైదరాబాద్‌: చూసేవారికి ఎక్కడి నుంచో తెచ్చి నేలపై ఉంచినట్లు కనిపించే  ఈ వృక్షాల పేరు ఫికస్‌ మైక్రోకార్పా బోన్సాయ్‌. మాదాపూర్‌ దుర్గంచెరువు పార్కు బయట ఆకట్టుకొంటున్నాయి.  సందర్శకులు  వీటి చెంత స్వీయచిత్రాలు దిగుతూ సందడి చేస్తున్నారు.

6/14
మెదక్‌: తూప్రాన్‌ మండలం ఆబోతుపల్లి నుంచి గుండ్రెడ్డ్డిపల్లి వెళ్లే వరకు రహదారికి రెండు వైపులా వృక్ష తోరణాలు వాహనదారులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఐదేళ్ల కిందట హరితహారంలో భాగంగా రెండువైపులా మొక్కలు నాటారు. అవి   నేడు ఏపుగా పెరిగి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.

7/14
నిజామాబాద్‌: బోధన్‌ మున్సిపల్‌ డీఈగా ప్రజారోగ్య శాఖ సబ్‌ డివిజన్‌ డీఈ నగేష్‌ను నియమించారు. ఈ మేరకు ఆ శాఖ ఉన్నతాధికారులు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇదివరకు డీఈగా పనిచేసిన శివానందంను సరెండర్‌ చేసిన విషయం తెలిసిందే.

8/14
తమిళనాడు: ఊటీలో పుష్పాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. బొటానికల్‌ గార్డెన్‌లో పుష్ప ప్రదర్శన కోసం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. 35 వేల తొట్టెల్లో మొక్కలు నాటారు. అద్దాల మాలిగలో పుష్ప గోపురం ఏర్పాటు చేశారు. పర్యాటకులు వాటివద్ద సెల్ఫీ తీసుకొని సంబరపడిపోతున్నారు.

9/14
విశాఖపట్నం: ‘ఆకులన్ని రాలిన చోటే కొత్తచిగురు కనిపిస్తుంది’ అన్నట్లు ఈ చెట్టు ఆకట్టుకుంటోంది. దొండపర్తి కూడలిలో 20 రోజుల కిందట రావిచెట్టు ఆకులు రాలిపోయి కళావిహీనంగా మారింది. ప్రస్తుతం అదే వృక్షం పచ్చని ఆకులతో కనువిందు చేస్తోంది.

10/14
చిత్తూరు: అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీవేంకటేశ్వర స్వామివారి వార్షిక తెప్పోత్సవాలు బుధవారం కనుల పండువగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు సీత, లక్ష్మణ, ఆంజనేయస్వామి సమేతంగా శ్రీరామచంద్రమూర్తి అవతారంలో దర్శనమిచ్చారు.రెండోరోజు గురువారం  రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామి అవతారంలో శ్రీవారు దర్శనమిస్తారు.

11/14
విశాఖపట్నం: సినీ నటి, టీవీ యాంకర్‌ అనసూయ బుధవారం పాయకరావు పేటలో లక్కీ షాపింగ్‌ మాల్‌ బ్రాంచి ప్రారంభ వేడుకల్లో సందడి చేసింది.

12/14
హైదరాబాద్‌: భెల్‌ కూడలిలో సినీ హీరో రామ్‌ పోతినేని సందడి చేశారు.సీఎంఆర్‌ షాపింగ్‌ మాల్‌ 31వ స్టోర్‌ను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభించారు. అనంతరం విచ్చేసిన సినీ హీరో రామ్‌ అక్కడికి చేరుకున్న అభిమానులకు అభివాదం చేశారు.అభిమానులతో సెల్ఫీలు తీసుకొంటూ వారిలో ఉత్సాహాన్ని నింపారు.

13/14
మెదక్‌: గజ్వేల్, మర్కూక్‌ మండల పరిధిలో ఇళ్ల ముందు నుంచే వెళుతున్న కొండపోచమ్మ సాగర్‌ జలాల్లో దూకి ఈత కొడుతున్నారు.  ఈత రాని పిల్లలు, లోతు ఎక్కువగా ఉన్న చోట మునిగిపోయే ప్రమాదం ఉంది. అపాయం జరిగిన తరువాత బాధపడేకన్నా.. ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా మంచిది.

14/14
అనంతపురం:  నార్పల మండల కేంద్రం మీదుగా కూతలేరు వాగు ప్రవాహానికి గుర్రపు డెక్క పెద్ద అడ్డంకిగా మారింది. వాగులో పెరిగిన గుర్రపు డెక్క కారణంగా ఉన్న కాస్త నీరు కదలకుండా ఆగిపోయింది. ఇక వర్షాకాలంలో ఏమాత్రం వరద పారినా గుర్రపుడెక్క కారణంగా పరిసరాలు మునిగే ప్రమాదం ఉంది. మొత్తం తొలగించి వాగులో ప్రవాహానికి వీలు కల్పించాలని రైతులు కోరుతున్నారు.

Tags :

మరిన్ని