రెండోస్థానం కోసం తెదేపా పోటీ: కన్నబాబు
close

తాజా వార్తలు

Updated : 14/04/2021 16:22 IST

రెండోస్థానం కోసం తెదేపా పోటీ: కన్నబాబు

తిరుపతి: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో తమ కుటుంబానికి సంబంధం లేదంటూ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేసే ప్రమాణాలకు అర్థం లేదని మంత్రి కన్నబాబు అన్నారు. ఆ హత్య కేసును సీఎం జగన్‌.. సీబీఐకి అప్పగించిన విషయం తెలియదా? సీబీఐ దర్యాప్తు చేపట్టినపుడు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఉంటుందా? అని లోకేశ్‌ను మంత్రి ప్రశ్నించారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కన్నబాబు మాట్లాడారు. 

తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికలో రెండోస్థానం కోసం  తెదేపా పోటీపడుతోందని మంత్రి ఎద్దేవా చేశారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. ఆయన వ్యాఖ్యలను మరిపించేందుకే ఈరోజు లోకేశ్‌ పర్యటన సాగిందన్నారు. తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి రావాలని సీఎం జగన్‌కు లోకేశ్‌ సవాల్‌ విసిరారన్నారు. తెదేపా నేతలు వస్తే తాడేపల్లి ప్యాలెస్‌ చూపిస్తామని.. హైదరాబాద్‌లో చంద్రబాబు ప్యాలెస్‌ను వైకాపా నేతలకు చూపించాలన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ప్రజలు ఆందోళన చేస్తుంటే భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడలేదని కన్నబాబు విమర్శించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని