కోసుకుని.. దాచుకునేలా!
మరుసటి రోజు వంట సులువవ్వడానికి ముందురోజు రాత్రే కాయగూరలు కోసుకుని ఉంచుకోవడం చాలామంది మహిళలకు అలవాటే! డబ్బా వెతుక్కొని, ఒక్కోదాన్నీ కోసుకుని
మరుసటి రోజు వంట సులువవ్వడానికి ముందురోజు రాత్రే కాయగూరలు కోసుకుని ఉంచుకోవడం చాలామంది మహిళలకు అలవాటే! డబ్బా వెతుక్కొని, ఒక్కోదాన్నీ కోసుకుని దానిలో దాచుకోవడం కొంత శ్రమే. ఈ పనిని సులువు చేస్తుందీ ‘కటింగ్ బోర్డ్ విత్ డ్రాయర్స్’. చెక్క, సిలికాన్ మెటీరియళ్లలో దొరికే దీనిలో పైన కట్ చేసుకోవడానికీ కింద స్టోరేజ్ బాక్సులు పెట్టుకోవడానికీ వీలుగా ఉంటుంది. కోసినవి నేరుగా బాక్సుల్లోకి పంపుకొనే సౌకర్యమూ ఉంటుంది. తర్వాత మూత పెట్టుకుని, దాచుకోవడమే తరువాయి! కావాలనుకుంటే ఈకామర్స్ వెబ్సైట్లలో ప్రయత్నించొచ్చు. ఏమంటారు మరి?
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
దలైలామా ప్రతినిధులతో మాత్రమే చర్చిస్తాం: చైనా