వాయిదా వేయొద్దు!

ఒకసారి కర్ణుడు తన ఆంతరంగిక మందిరంలో అభ్యంగన స్నానం చేస్తూ ఉన్నాడు. ఇంతలో ఓ విషయం మాట్లాడేందుకు శ్రీకృష్ణుడు అక్కడకు వచ్చాడు. ద్వారపాలకులు సమాచారం ఇవ్వగానే కృష్ణుడిని వెంటనే తన దగ్గరకు

Published : 25 Feb 2021 00:53 IST

కసారి కర్ణుడు తన ఆంతరంగిక మందిరంలో అభ్యంగన స్నానం చేస్తూ ఉన్నాడు. ఇంతలో ఓ విషయం మాట్లాడేందుకు శ్రీకృష్ణుడు అక్కడకు వచ్చాడు. ద్వారపాలకులు సమాచారం ఇవ్వగానే కృష్ణుడిని వెంటనే తన దగ్గరకు తోడ్కొని రమ్మని చెప్పాడు కర్ణుడు. కృష్ణుడు అక్కడకు రాగానే ఆయన దృష్టి రాధేయుడి ఎదుట ఉన్న స్నానలేపనాల పాత్రపై పడింది. ఖరీదైన ఆ రత్నఖచిత బంగారు పాత్రను చూసి అబ్బురపడుతూ వివరాలు అడిగాడు. వెంటనే కర్ణుడు కృష్ణా! ఇది నీకు అంతగా నచ్చిందా... అయితే నీ మందిరానికి దీన్ని తీసుకెళ్లు... అంటూ ఎడమచేతితో ఇచ్చాడు. ఆ క్షణంలో కర్ణుడి కుడి చేయంతా నూనెలతో మలినంగా ఉంది. దీంతో వామహస్తంతో దాన్ని ఇచ్చాడు. అప్పుడు కృష్ణుడు కర్ణా! నువ్వు ఎంతో ఇష్టపడే ఈ పాత్రను వామహస్తంతో ఇవ్వడం భావ్యమా? అని అన్నాడు. అప్పుడు కర్ణుడు.. కృష్ణా! చేయి శుభ్రం చేసుకుని వచ్చేలోపు మనసు ఎలా మారతుందో తెలీదు.ఏ మంచిచైనా అనుకున్న క్షణంలో చేయడం మంచిది... అందుకే అలా ఇచ్చాను...
క్షణం చిత్తం క్షణం విత్తం జీవితమాయయో
యమస్య కరుణా నాస్తి ధర్మస్య త్వరితా గతిః

ఇప్పుడున్న ధనం మరుక్షణాన మాయమై పోవచ్చు. యమధర్మరాజు ఎవరిపై కరుణ చూపడు.  జీవితం క్షణంలో అంతమై పోవచ్చు. అందుకే ధర్మాన్ని ఆచరించడం వాయిదా వేసుకోకూడదు. అన్నాడు దాన కర్ణుడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని