శ్లోకామృతం

గర్జతి శరది న వర్షతి, వర్షతి వర్షాసు నిస్స్వనో మేఘః నీచో వదతి న కురుతే, న వదతి సుజనో కరోత్యేవ!

Published : 16 Sep 2021 01:01 IST

గర్జతి శరది న వర్షతి, వర్షతి వర్షాసు నిస్స్వనో మేఘః

నీచో వదతి న కురుతే, న వదతి సుజనో కరోత్యేవ!

ఉత్తముడికి, నీచుడికి ఉన్న తేడాను ఇలా వర్ణిస్తున్నారు... శరత్కాలంలో మేఘాలు ఉరుముతాయే తప్ప, ఒక్క చినుకైనా రాలదు. కానీ వర్షాకాలంలో ఉరుములు మెరుపులు లేకుండానే మేఘాలు వర్షిస్తాయి. అలాగే నీచులు ఆడంబరంగా మాట్లాడటమే తప్ప ఒక్క పనీ చేయరు. కానీ కార్యసాధకులు మాటలతో కాలక్షేపం చేయకుండా, తమ పనేదో తాము ప్రశాంతంగా పూర్తిచేసి విజయం సాధిస్తారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని