నిజమైన భక్తి

చాలామంది చాటున పాపాలు చేస్తూ.. అందరి ముందూ మంచివారిలా, భక్తుల్లా నటిస్తుంటారు. ఇలాంటివారి గురించి దేవుడు ‘మీలో చాలామంది పెదాలతో నన్ను స్మరిస్తారు.

Published : 26 Jan 2023 00:31 IST

చాలామంది చాటున పాపాలు చేస్తూ.. అందరి ముందూ మంచివారిలా, భక్తుల్లా నటిస్తుంటారు. ఇలాంటివారి గురించి దేవుడు ‘మీలో చాలామంది పెదాలతో నన్ను స్మరిస్తారు. హృదయం మాత్రం నాకు దూరంగా ఉంది’ అన్నాడు. మరి ఏది నిజమైన భక్తి, దేవుడు మన నుంచి కోరుకునే దేమిటి అంటే.. ఏసు సహోదరుడు, ఆయన శిష్యుడు అయిన యాకోబు రాసిన గ్రంథంలో ‘లోకంలో పాపాలు, కళంకాలు అంటకుండా ఎవరికి వారు కాపాడుకోవాలి. తండ్రియైన దేవుడికి మనం నివేదించే పవిత్రమైన నిష్కళంకమైన భక్తి ఏమిటంటే.. పేదలు, పిల్లలు, స్త్రీలు నిస్సహాయ స్థితిలో ఉంటే వారిని పరామర్శించాలి. సాయం చేయాలి. అలా మానవత్వం ప్రదర్శిస్తూ దేవుడికి నచ్చే రీతిలో జీవించాలి’ అంటూ సమాధానం ఉంది.

జి.ప్రశాంత్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని