ఆగ్రహించిన మాత

ఒకసారి ఓ భక్తురాలు.. శారదా మాత వద్దకు తన కూతుర్ని తీసుకొచ్చింది. ఆమెకింకా యుక్త వయసైనా రాలేదు. ‘అమ్మా! తమరే నాకు మేలు చేయాలి.

Published : 02 Nov 2023 00:41 IST

కసారి ఓ భక్తురాలు.. శారదా మాత వద్దకు తన కూతుర్ని తీసుకొచ్చింది. ఆమెకింకా యుక్త వయసైనా రాలేదు. ‘అమ్మా! తమరే నాకు మేలు చేయాలి. ఈమె నా కూతురు. పెళ్లి చేస్తానంటే ఎంతకీ లొంగడంలేదు. పైగా చదివించమని అడుగుతోంది. ఇంత మతిలేని ప్రేలాపనలు ఏమిటమ్మా?! మీరే కాస్త బుద్ధి చెప్పండి. ఈమె మనసు మారేలా హితబోధ చేయండి’ అంటూ వేడుకుంది.

ఓపిగ్గా ఆ మాటలు విన్న శారదాదేవికి చాలా కోపం వచ్చింది. ‘నీ కూతురికి కాదమ్మా.. నీకే మతి భ్రమించింది. ఆటపాటలతో గడపాల్సిన ఇంత చిన్న వయసులో పెళ్లి చేసి.. ఆమెకి జీవితం లేకుండా చేయాలనుకుంటున్నావా? చిన్నారిని చదువుకోనివ్వు.. తన భవిష్యత్తు ఎలా ఉండాలో తానే నిర్ణయించుకుంటుంది’ అంటూ మందలించారామె.

శారదా మాత ఆధ్యాత్మిక చింతన పెంచడంతో పాటు.. సామాజిక వృద్ధిని ఆశిస్తూ.. అందుకు తగినట్లు ప్రవచించేవారు.

గోవిందం ఉమామహేశ్వరరావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని