దురాధర్షః

విష్ణుసహస్రనామావళిలో ఇది 81వది. ‘దురాధర్షః’ అంటే ఆయనను ఎదిరించగల శక్తి వేరెవ్వరికి లేనటువంటి వాడు అని అర్థం. సర్వ శక్తి సంపన్నుడాయన.

Published : 11 Jan 2024 00:10 IST

వందే విష్ణుం!

 

విష్ణుసహస్రనామావళిలో ఇది 81వది. ‘దురాధర్షః’ అంటే ఆయనను ఎదిరించగల శక్తి వేరెవ్వరికి లేనటువంటి వాడు అని అర్థం. సర్వ శక్తి సంపన్నుడాయన. అధర్మ మార్గాన్ని అనుసరించే ఎందరో అసురులు ఆ జగన్నాథుని ఎదిరించాలని ఎంతగా ప్రయత్నించినా ఏ ఒక్కరూ బతికి బట్టకట్ట లేదు. ధర్మాన్ని రక్షించగల శక్తి సంపన్నుడు ఆ స్వామి అనే విషయాన్ని అనేక ఉదంతాలు నిరూపించాయి. అందుకే ధర్మమార్గంలో సాగే స్వామి భక్తులకు గొప్ప మనశ్శాంతి లభిస్తుంటుంది.

వై.తన్వి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని