కపాలం మాట్లాడితే!

ప్రవక్త ఈసా అలైహిస్సలాం దూర ప్రాంతానికి వెళ్తుండగా దారిలో మనిషి కపాలం కనిపించింది. ‘దీనికి ప్రాణం పోసి మాట్లాడే శక్తినిచ్చి, పూర్వ సంఘటనలు చెప్పేలా ప్రార్థించండి! అందువల్ల మేమేదైనా నేర్చుకోగలం’ అన్నారు వెంటనున్న అనుచరులు. అప్పుడు ప్రవక్త ఈసా (అలై) నమాజు చేసి ప్రార్థించగా,

Updated : 10 Mar 2022 05:11 IST

ప్రవక్త ఈసా అలైహిస్సలాం దూర ప్రాంతానికి వెళ్తుండగా దారిలో మనిషి కపాలం కనిపించింది. ‘దీనికి ప్రాణం పోసి మాట్లాడే శక్తినిచ్చి, పూర్వ సంఘటనలు చెప్పేలా ప్రార్థించండి! అందువల్ల మేమేదైనా నేర్చుకోగలం’ అన్నారు వెంటనున్న అనుచరులు. అప్పుడు ప్రవక్త ఈసా (అలై) నమాజు చేసి ప్రార్థించగా, ‘మీ సందేహమేంటో అడగండి’ అంది కపాలం.
‘చనిపోకముందు నువ్వెవరివి? నీ జీవిత విశేషాలేంటో చెప్పు’
‘నేనీ ప్రాంతానికి చక్రవర్తిని. వెయ్యేళ్లు జీవించాను. వెయ్యి పట్టణాలు జయించాను. వేలాదిమందిని హతమార్చాను. చివరాఖరికి మృత్యువు కబళించింది. ఏళ్ల తరబడి అశాంతితో గడిపిన నాకు దైవభీతి, భక్తిపరాయణతకు మించిన భాగ్యం లేదని బోధపడింది’ అంటూ చెప్పింది కపాలం. అనుచరులు జీవితసత్యాన్ని తెలుసుకున్నారు.

- ముహమ్మద్‌ ముజాహిద్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని