అంతా మన మంచికే...

మౌనికి మాటలు రావు. ఆమె ఎప్పుడు మాట్లాడుతుందోనని చిన్నారి జిబ్రి బాధపడటం అటుగా వెళ్తున్న సాయి విన్నాడు. ఒక చిన్న రాతి దెబ్బతో మౌనికి మాటలు వచ్చేలా చేశాడు. జిబ్రి సాయికి లడ్డూ ఇచ్చి, ‘బాబా! మనల్ని దేవుడే రక్షిస్తాడంటారు.

Updated : 11 Aug 2022 01:12 IST

మౌనికి మాటలు రావు. ఆమె ఎప్పుడు మాట్లాడుతుందోనని చిన్నారి జిబ్రి బాధపడటం అటుగా వెళ్తున్న సాయి విన్నాడు. ఒక చిన్న రాతి దెబ్బతో మౌనికి మాటలు వచ్చేలా చేశాడు. జిబ్రి సాయికి లడ్డూ ఇచ్చి, ‘బాబా! మనల్ని దేవుడే రక్షిస్తాడంటారు. మాటలు తెప్పించి కాపాడారంటే మీరు దేవుడా?’ అనడిగింది. ‘సాయం చేసేవారంతా దేవుళ్లే. నువ్వు లడ్డూ ఇచ్చావు కనుక నువ్వూ దేవుడివే. ఇక నుంచి నిన్ను లక్ష్మీ అంటూ దేవత పేరుతో పిలుస్తాను’ అన్నాడు సాయి. అంతలో మౌని తల్లి వచ్చి మిఠాయిలు, పళ్లు ఇవ్వబోయింది కృతజ్ఞతగా. సాయి వద్దని వారిస్తే ‘మాకు దేవుడి మీద పోయిన నమ్మకాన్ని మీరు నిలబెట్టారు. వీటిని స్వీకరించాల్సిందే’ అంది. సాయి నవ్వి ‘జరిగిన మంచిచెడులను దేవుడికి అంటగడితే ఎలా? పైగా దేవుడు చెడు చేసినా అందులో ఏదో మంచి దాగుంటుందని అర్థం చేసుకోవాలి. అంతా మన మంచికే అనుకోవాలి. సర్వాంతర్యామి ఇచ్చిన ఈ జీవితాన్ని పదిమంది కోసం వెచ్చించాలి. దేవుని మీద అచంచల విశ్వాసాన్ని ఉంచాలి’ అన్నాడు సాయి.

- లక్ష్మి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని