పరమాత్మా

విష్ణు సహస్ర నామావళిలో ఇది పదకొండవది. ‘అందరికీ తానే ఆత్మగా ఉంటాడే కానీ, తనకు వేరే ఆత్మ లేనివాడు’ అని ఈ నామానికి అర్థం. సర్వ జీవ రాశిలోనూ భగవానుడు తానే ఆత్మగా ఉంటాడు.

Published : 18 Aug 2022 01:12 IST

విష్ణు సహస్ర నామావళిలో ఇది పదకొండవది. ‘అందరికీ తానే ఆత్మగా ఉంటాడే కానీ, తనకు వేరే ఆత్మ లేనివాడు’ అని ఈ నామానికి అర్థం. సర్వ జీవ రాశిలోనూ భగవానుడు తానే ఆత్మగా ఉంటాడు. అందుకే పెద్దలు ‘అందరిలోనూ దేవుడు ఉంటాడు’ అని చెబుతుంటారు. అంతే కాదు ఆయన నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వరూపమై కార్యకారణాల కంటే విలక్షణమై ఉంటాడనేది అంతరార్థం.

- వై.తన్వి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని