ఇవి పరమ రహస్యాలు!

గోప్యం అంటే రహస్యమైందని మనందరికీ తెలుసు. ఆయుష్షు, ధనం, ఇంటిగుట్టు, మంత్రం, ఔషధం, సంగమం, దానం, మానం, అవమానం- వీటిని నవగోప్యాలంటారు.

Published : 03 Nov 2022 00:08 IST

గోప్యం అంటే రహస్యమైందని మనందరికీ తెలుసు. ఆయుష్షు, ధనం, ఇంటిగుట్టు, మంత్రం, ఔషధం, సంగమం, దానం, మానం, అవమానం- వీటిని నవగోప్యాలంటారు. ఈ తొమ్మిది రహస్యాలను కాపాడుకునేవాళ్లు విజ్ఞులు. ఆయుష్షు గురించి మనకు తెలియదు. జ్యోతిషశాస్త్రం ప్రకారం తెలిసినా చెప్పకూడదన్నారు. ధనం గురించిన వివరాలు చెప్పడం వల్ల ఉపద్రవాలు ముంచుకురావడమే తప్ప ప్రయోజనం శూన్యం. అందువల్ల అది చెప్పకూడదు. ఇంట్లో ఎన్నో రహస్యాలుంటాయి వాటిని బహిర్గతం చేస్తే ప్రేమాభిమానాలు దెబ్బ తింటాయి. గురువు ద్వారా నేర్చుకుని మౌనంగా మననం చేసేది మంత్రం. బయటకు పలకకూడదు. వేరొకరికి చెప్పరాదు. మొక్కలన్నీ ఔషధప్రాయాలే. ఏ మొక్కలో ఏ ఔషధగుణముందో చెప్పకూడదు. ఆయా సందర్భాల్లో జరిగే రహస్య సమావేశాల గురించి బహిర్గతం చేయరాదు. ఔదార్యంతో చేసిన దానాన్ని గుప్తంగా ఉంచితేనే సత్ఫలితం. మౌనం అంటే గౌరవం. ఉబుసుపోక కబుర్లు కూడదు. అవసరమైతేనే మాట్లాడాలి. ఏ కారణంగానైనా అవమానం జరిగితే.. దాన్ని గుర్తుతెచ్చుకోవడం, ఇతరులతో పంచుకోవడం అనర్థదాయకం. కనుక అవమానాన్ని మర్చిపోవడమే మంచిది.

- పులిగండ్ల చిదంబరం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని