స్వపరీక్ష అవసరం

చాలామంది చాలా విషయాల్లో ఎదుటి వాళ్లను గురించి తప్పుగా మాట్లాడతారు. వారు చేసే పనుల్లో వంకలు పెడుతూ ఎత్తి చూపుతారు.

Published : 29 Dec 2022 00:23 IST

చాలామంది చాలా విషయాల్లో ఎదుటి వాళ్లను గురించి తప్పుగా మాట్లాడతారు. వారు చేసే పనుల్లో వంకలు పెడుతూ ఎత్తి చూపుతారు. తమ ప్రవర్తన, జీవనవైఖరి ఎలా ఉన్నా... ఇతరులకు సలహాలిస్తూ తీర్పు ఇవ్వాలని చూస్తారు. ఇలాంటి వారి గురించి ఒక సందర్భంలో ఏసు ప్రభువు ‘నీ కంటిలో దూలాన్ని పట్టించుకోకుండా ఎదుటివారి కంట్లో నలుసు ఉందని ఫిర్యాదు చేస్తావెందుకు? ఎదుటివారిని తప్పుపట్టే ముందు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి’ అన్నారు. మనల్ని మనం సరిదిద్దుకున్నాక ఇతరులకు చెప్పాలన్నది అందులోని పరమార్థం. కనుక ఇతరులను తప్పుపట్టి తూలనాడే ముందు స్వపరీక్ష అవసరం.

జి.ప్రశాంత్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని