మేల్కొలుపు

ఖాసిం బిన్‌ ముహమ్మద్‌ సతీమణి మరణించిందని తెలిసి ముహమ్మద్‌ బిన్‌ అల్‌ ఖర్బీ వచ్చారు.

Published : 05 Jan 2023 00:09 IST

ఖాసిం బిన్‌ ముహమ్మద్‌ సతీమణి మరణించిందని తెలిసి ముహమ్మద్‌ బిన్‌ అల్‌ ఖర్బీ వచ్చారు. ఖాసింను ఓదారుస్తూ ఓ కథ చెప్పారు. ‘ఒక పండితుడి సంసారం మధురంగా సాగుతుండగా అతడి భార్య చనిపోయింది. అది భరించలేక నిరంతరం రోదించేవాడు. ఎవరినీ కలిసేవాడు కాదు. అతణ్ణి అనునయించాలనుకున్న ఒక మహిళ ధర్మసందేహం తీర్చుకునే నెపంతో వచ్చింది. ‘అయ్యా! మా పొరుగింటావిడ దగ్గర బంగారు నగలు తీసుకుని చాలా రోజులైంది. ఇన్నాళ్లకి వాటిని తిరిగివ్వమంటోంది. ఇవ్వాలా, వద్దా?’ అనడిగింది. ‘నిస్సందేహంగా ఇచ్చేయాలి’ అన్నాడతడు. దానికామె ‘కానీ.. ఆ నగలు చాలాకాలం నా దగ్గరే ఉన్నాయి కనుక నాకే చెందుతాయిగా!’ అంది. ‘కానీ ఎవరి సొమ్ము వారికి అప్పజెప్పడమే సబబు’ అన్నాడు. అప్పుడామె ‘అల్లాహ్‌ కరుణించు గాక! మీకు దేవుడిచ్చిన ఆభరణాన్ని (భార్య) ఆయనే తీసుకెళ్లాడు’ అంది. ఆమె వివేకం పండితుడి కళ్లు తెరిపించింది.

 తహూరా సిద్దీఖా


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని